Asianet News TeluguAsianet News Telugu

భారీగా తగ్గిన వాహనాల సేల్స్...కారణాలివే

అధిక బీమా ప్రీమియం, వాహనాల ధర పెరుగుదల, ఎన్బీఎఫ్సీలో నిధుల కొరత, జీఎస్టీ ఎఫెక్ట్‌తో గతేడాది మే తర్వాత తొలిసారి వాణిజ్య వాహనాలు విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. 
 

Complete Auto Sales Analysis November: CV makers move in red for the first time since May 2017
Author
Hyderabad, First Published Dec 3, 2018, 2:57 PM IST

న్యూఢిల్లీ: అధిక బీమా వ్యయం, అధిక వాహనాల ధర, ఎన్బీఎఫ్సీ రంగంలో నిధుల కొరత వంటి అంశాలు నవంబర్ నెలలో దేశీయ ప్రయాణికుల విక్రయాలు వరుసగా ఐదో నెల పడిపోయింది. హోల్ సేల్ విక్రయాల్లో పండుగల వేళ విక్రయాలు పేలవంగా ఉన్నాయి. డీలర్ల వద్ద అధిక నిల్వలు ఉండిపోయాయి. కానీ గతేడాది నవంబర్ నెల విక్రయాలు అధికంగా ఉంటే గత నెలలో విక్రయాలు పడిపోయాయని ‘నొమురా’ అనే ఆర్థిక విశ్లేషణ సంస్థ అంచనా వేసింది. 

42 రోజుల పాటు సాగిన ఫెస్టివల్ పీరియడ్‌లో గత ఏడాది 23,01,986 కార్లు, ఇతర వాహనాలు విక్రయిస్తే, గత నెలలో 20,49,391 వెహికల్స్ అమ్ముడు పోయాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఎడీఏ) ఆందోళన వ్యక్తం చేసింది. స్థూలంగా 11 శాతం విక్రయాలు తగ్గాయని ఫడా పేర్కొంది. 

ఫెస్టివల్ సీజన్‌లో కార్లు, యుటిలిటీ వాహనాల విక్రయాలు పతనం అయ్యాయని పతనం అయ్యాయి. మారుతి, హ్యుండాయ్, మహీంద్రా సేల్స్ తగ్గాయి. భారీ వ్యయంతో ఆటోమొబైల్ సంస్థలు నూతన మోడల్స్ మార్కెట్లోకి ఆవిష్కరించినా నవంబర్ నెలలో పడిపోయాయి. దీపావళి పండుగ తర్వాత 40-45 రోజుల పాటు డీలర్ల వద్దే కార్లు ఉండిపోయాయని క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ హీటల్ గాంధీ పేర్కొన్నారు. 

సూక్ష్మ, ఆర్థిక పరిస్థితుల వల్లే కార్లు, మోటార్ సైకిళ్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. అలాగే వాణిజ్య వాహనాల విభాగంలోనూ వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాదిలో కమర్షియల్ వెహికల్స్ సెగ్మెంట్‌ విక్రయాలు తగ్గిపోవడం ఇదే మొదటిసారి. అంతేకాదు 2017 మే నెల నుంచి వాణిజ్య వాహనాల విభాగ విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపాయి. అధిక వడ్డీరేట్లు, ఇంధన ధరలు, పేలవమైన ఫెస్టివల్ సీజన్ పుణ్యమా? అని వాణిజ్య వాహనాలు తొలిసారి పడిపోయాయి. 

దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహనాల ఉత్పత్తిదారు టాటా మోటార్స్ సేల్స్ 5.15 శాతం తగ్గాయి. గతేడాది 35,307 యూనిట్లు అమ్ముడు పోతే ఈ ఏడాది 33,488 వాహనాల విక్రయాలు తగ్గాయి. విక్రయాలు తగ్గిపోవడంతో స్మాల్ ఆపరేటర్ల లాభదాయకతపైనా ప్రతికూల ప్రభావం పడింది. దీనికి జీఎస్టీ వల్ల బెనిఫిట్లు అతిపెద్ద ఆపరేటర్లకు లబ్ధి చేకూరడమే దీనికి కారణం.

దేశంలో రెండో అతిపెద్ద వాణిజ్య వాహనాల ఉత్పత్తిదారు అశోక్ లేలాండ్ తొమ్మిది శాతం విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. 2017లో 14,457 వాహనాలు అమ్ముడుపోతే, ఈ ఏడాది 13,121 యూనిట్లు మాత్రమే విక్రయం అయ్యాయి. మహీంద్రా అండ్ మహీంద్రా వాణిజ్య వాహనాల విభాగం విక్రయాలు గతేడాది 19,673 యూనిట్లు జరిగితే 26 శాతం వ్రుద్ధి సాధించింది. గతేడాది కేవలం 15,554 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios