Asianet News TeluguAsianet News Telugu

పోలీసుల చలాన్‌ను తప్పించుకునేందుకు ప్రియురాలిని కింద పడేసి పారిపోయిన బైకర్.. వీడియో వైరల్!

ట్రాఫిక్ పోలీసుల ముందు నిబంధనలు ఉల్లంఘిస్తే పెట్టుకోకుండా వదిలేస్తారా? ఇలా నిబంధనలు ఉల్లంఘించి  పోలీసులు  పట్టుకునేందుకు వెళ్లిన బైకర్ ఒక్కసారిగా యాక్సిలరేటర్‌ పెంచాడు. దింతో వెనుక కూర్చున్న అతని  ప్రియురాలు కిందపడిపోయినా చూడకుండా పారిపోయిన వీడియో వైరల్‌గా మారింది.
 

Biker who ran away by dropping his girlfriend to avoid police challan, video viral!-sak
Author
First Published Aug 17, 2023, 11:25 PM IST

బెంగళూరు: సిటీ, హైవేలలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు సీసీటీవీ ఆధారంగా ఈ-చలాన్ జారీ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తుంటారు. పోలీసుల బైక్ ఎదుటే విన్యాసాలు చేస్తూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారా ? ఇలా ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వారిని  సిగ్నల్ దగ్గర రెడ్ హ్యాండెడ్ గా   బైకర్లను పట్టుకునేందుకు వెళ్లారు. పోలీసులను చూడగానే బైక్ యాక్సిలరేటర్‌ని ఒకేసారి పెంచి బైక్‌ను ముందుకు తీసుకెళ్లాడు. అయితే ఇవేమీ తెలియక వెనుక కూర్చున్న అతడి  ప్రియురాలు  భయాందోళనకు గురైంది. ప్రియురాలు కిందపడిపోయినా బైక్ ఆపకుండా వేగంగా పోలీసుల నుండి తప్పించుకున్న  ఘటన తాజాగా చోటుచేసుకుంది. దింతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

వాహనాలు, జనంతో రోడ్డు కిక్కిరిసిపోయింది. సిగ్నల్ దగ్గర వాహనాలు నిలిచిపోయాయి. అదే దారిలో ఓ బైకర్ తన ప్రియురాలిని కూర్చోబెట్టుకుని వస్తున్నాడు. అతనికి హెల్మెట్ లేదు, వెనుక కూర్చున్న అతని ప్రియురాలికి కూడా హెల్మెట్ లేదు. అతని వాహనానికి సరైన నంబర్ ప్లేట్ కూడా లేదు. కాబట్టి బైక్ RC, పొల్యూషన్, ఇన్సూరెన్స్  పేపర్స్  ఉండే అవకాశాలు చాలా తక్కువ.

రోడ్డుకు కుడివైపున ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఈ బైక్‌ను గమనించి వెంటనే బైక్‌ని పట్టుకునేందుకు వెళ్లారు. పోలీసులు అటుగా వస్తున్నారని గమనించిన బైకర్, క్షణంలో అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేశాడు. పోలీసుల చేతికి చిక్కకుండా చలాన్ తప్పించుకోవాలని ప్లాన్ చేసిన బైకర్.. అదే సమయంలో యాక్సిలరేటర్ పెంచాడు. 

బైక్ ఒక్కసారిగా ముందుకు దూసుకుపోయింది. తనకు తెలియకుండానే అతని ప్రియురాలు  బైక్ పై నుంచి కిందపడిపోయింది. బైక్ వేగంగా ముందుకు వెళుతున్న సమయంలో హోండా యాక్టివా స్కూటర్‌ను ఢీకొట్టింది. అక్కడి నుంచి మళ్లీ తప్పించుకుని మెరుపు వేగంతో పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యాడు. కానీ అతని బైక్‌పై కూర్చున్న ప్రియురాలు కిందపడిపోయి  అవమానంతో లేచింది, ఆమెను ఓదార్చిన ట్రాఫిక్ పోలీసులు సమీపంలోని షాప్ వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టి  వాటర్  ఇచ్చారు. 

ఈ వైరల్ వీడియో ఘటన కోల్‌కతాలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై పలువురు సోషల్ మీడియా లో కామెంట్లు కూడా చేశారు. తాను ప్రేమించిన అమ్మాయిని 500 రూపాయల చలాన్ కోసం లవ్ బ్రేక్ చేశాడని ఒకరు,  ట్రాఫిక్‌కే కాదు, ఎన్నో రూల్స్‌ను కూడా బ్రేక్ చేసాడు అని మరొకరు,  అమ్మాయిలు బైక్ వెనుక కూర్చొని అబ్బాయి పర్సులో డబ్బు ఉందో లేదో చూసుకోవడమే కాకుండా బైక్ రిజిస్ట్రేషన్ కార్డు ఉందో లేదో కూడా చూసుకోవాలని ఇంకొకరు ఇలా సూచించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios