Asianet News TeluguAsianet News Telugu

తక్కువ ధరకే మారుతి సుజుకి కొత్త కార్.. మైలేజ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే..

మారుతి బ్రెజ్జా భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సబ్-కాంపాక్ట్ SUVలలో ఒకటి. ఇప్పుడు బ్రెజ్జా కారు సి‌ఎన్‌జి రూపంలో లాంచ్  చేయబడింది. ఈ కార్ బడ్జెట్ ధరతో పాటు 26 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. 

Affordable Brand New Maruti Brezza CNG Car Launched with 26 Km Mileage!
Author
First Published Mar 20, 2023, 7:49 PM IST

వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీకి భారతదేశంలో అత్యధిక మార్కెట్ వాటా ఉంది. మారుతీ సుజుకి కార్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. బడ్జెట్ ధర, తక్కువ మెయింటైనెన్స్ ఖర్చు, ఎక్కువ మైలేజీ వంటి ఎన్నో కారణాల వల్ల మారుతి సుజుకి కార్లు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. అయితే మారుతి సుజుకి కార్లలో బ్రెజ్జా కారుకి ఎక్కువగా డిమాండ్ ఉంది. మారుతి సుజుకి బ్రెజ్జా ఇప్పుడు సరికొత్త రూపంలో విడుదలైంది. ఈ CNG వేరియంట్ బ్రెజ్జా S కారు మార్కెట్లోకి ప్రవేశించింది. విశేషం ఏంటంటే ఒక కిలో సిఎన్‌జితో  మారుతి సుజుకి బ్రెజ్జా 25.51 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, బ్రెజ్జా CNG కారు ఇప్పుడు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో విడుదల చేయబడింది.

సరికొత్త మారుతి సుజుకి బ్రెజ్జా CNG కారు ధర రూ. 9.14 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఈ కారులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త కారులో 1.5 లీటర్ డ్యూయల్ జెట్ ఇంజన్ లభిస్తుంది.

మారుతీ బ్రెజ్జా CNG కారు ధర
LXi S CNG: రూ. 9,14,00(ఎక్స్-షోరూమ్) 
VXi S CNG: రూ. 10,49,500 (ఎక్స్-షోరూమ్) 
ZXi S CNG: రూ. 11,89,500(ఎక్స్-షోరూమ్)   
ZXi S CNG డ్యూయల్ టోన్: రూ. 12,05,50 (ఎక్స్-షోరూమ్)  

బ్రెజ్జా CNG కారు నెక్స్ట్ జనరేషన్ K-సిరీస్ 1.5-లీటర్ డ్యూయల్-జెట్, డ్యూయల్-VVT ఇంజన్‌తో వస్తుంది. ఈ కారు 86.6బిహెచ్‌పి పవర్, 121.5ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీనికి 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ ట్రాన్స్‌మిషన్  ఉంది. 

సరికొత్త మారుతి బ్రెజ్జా CNG కారు గేమ్ ఛేంజర్‌గా మారబోతోంది. ఈ కారులో కొత్త డిజైన్, కొత్త ఇంజన్, మెరుగైన పనితీరు సహా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. కస్టమర్ డిమాండ్‌కు అనుగుణంగా ఈ కారును రూపొందించారు. ఈ కారు అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతితో పాటు ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని మారుతీ సుజుకీ సీనియర్ అధికారి శశాంక శ్రీవాత్సవ తెలిపారు.

గత నెలలో రికార్డు  
గత నెలలో మారుతి సుజుకి దేశవ్యాప్తంగా 3.35 లక్షల ప్యాసింజర్ వాహనాలు విక్రయించింది. దీంతో వాహన తయారీ కంపెనీలు  విక్రయాల్లో మంచి పురోగతిని నమోదు చేశాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 11% అధికం. అలాగే, ఫిబ్రవరి నెలలో   సంవత్సరంలోనే అత్యధిక అమ్మకాలు నమోదయ్యాయి. వీటిలో మారుతీ సుజుకీ 11% (1.55 లక్షలు), హ్యుందాయ్ 7% (47001), మహీంద్రా 10% (30358), కియా 36% (24600), బజాజ్ ఆటో 36% (1.53 లక్షలు) ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios