Asianet News TeluguAsianet News Telugu

భారత మార్కెట్లోకి హయబుస 2019 బైక్... ధర ఎంతో తెలుసా?

ప్రముఖ వాహనతయారీ సంస్థ సుజుకి మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ సరికొత్త హంగులతో మరో నూతన ద్విచక్ర వాహనాన్ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గత 20 ఏళ్లుగా భారతీయ యువతకు వివిధ మోడళ్ల రూపంలో ఆకట్టుకున్న హయబుస... మరో సరికొత్త రూపంలో అందుబాటులోకి వచ్చింది. 
 

2019 Suzuki Hayabusa Launched In India
Author
Hyderabad, First Published Dec 27, 2018, 3:51 PM IST

ప్రముఖ వాహనతయారీ సంస్థ సుజుకి మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ సరికొత్త హంగులతో మరో నూతన ద్విచక్ర వాహనాన్ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గత 20 ఏళ్లుగా భారతీయ యువతకు వివిధ మోడళ్ల రూపంలో ఆకట్టుకున్న హయబుస... మరో సరికొత్త రూపంలో అందుబాటులోకి వచ్చింది. 

మారుతున్న టెక్నాలజీ, ప్రత్యర్థుల నుండి ఎదురయ్యే పోటీ, వినియోగదారులు తమ నుండి కోరుకునే సదుపాయాలను దృష్టిలో పెట్టుకుని సుజుకి సంస్థ హయబుస 2019 మోడల్ ను రూపొందించింది. ప్రదానంగా ఉన్నత వర్గాలకు చెందిన యువతను టార్గెట్ చేసుకుని గత మోడల్ ని సరికొత్త హంగులతో మార్పులు చేసినట్లు సుజుకి సంస్థ వెల్లడించింది.   హయబూస 2019 ఎడిషన్‌ను ధరను రూ.13.74లక్షలు(ఎక్స్‌ షోరూమ్‌ దిల్లీ) నిర్ణయించారు.

రెండు సరికొత్త రంగుల్లో ఈ మోడళ్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. మెటాలిక్ వూర్ట్ గ్రే మరియ గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ రంగులతో అత్యాధునికమైన గ్రాఫిక్స్ తో రూపొందించారు. ఈ బైకు 1,340 సీసీ ఇంజిన్‌ను కెపాసిటీని కలిగివుంది. 

వివిధ కారణాలతో నూతన సంవత్సరంలో ఈ మోడల్ వాహనాల అమ్మకాలను యూరోప్ దేశాల్లో నిలిపివేస్తున్నట్లు సుజుకి సంస్థ తెలిపింది.  కానీ ఇండియా, అమెరికా దేశాల్లో వీటి అమ్మకాలు ఎప్పటిమాదిరిగానే కొనసాగనున్నాయి. 
 
స్పోర్ట్స్ బైక్స్ విభాగంలో తాము గత ఇరవై సంవత్సరాల క్రితం విడుదల చేసిన హయబుస భారతీయ యువతి నుండి విశేషమైన ఆదరణ చూరగొందని సుజుకి మోటార్ సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సతొషీ ఉచిద పేర్కొన్నారు. వారికి మరింత చేరువయ్యే ఉద్దేశ్యంతోనే సరికొత్త హయబుస 2019 ని రూపొందించినట్లు తెలిపారు. ఔత్సాహిక యువతను దృష్టిలో పెట్టుకునే దీని రూపకల్పన జరిగిందని సతోషి తెలిపారు. 

హయబుస 2019 మోడల్ బైక్ కేవలం 2.74 సెకన్లలోనే 0 నుండి 100కిమీ ఫర్ అవర్ వేగాన్ని అందుకోగలదని సుజుకి సంస్థ తెలిపింది. గరిష్టంగా 299 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో దూసుకెళ్ళే సామర్థ్యంతో ఈ సరికొత్త మోడల్ ని రూపొందించారు.   
 

Follow Us:
Download App:
  • android
  • ios