Asianet News TeluguAsianet News Telugu

23 అక్టోబర్ 2018 మంగళవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today 23rd oct your horoscope
Author
Hyderabad, First Published Oct 23, 2018, 9:38 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య అభివృద్ధి పెరుగుతుంది. వ్యాపారస్తులు జాగ్రత్త అవసరం. పదిమందిలో గౌరవంకోసం ప్రయత్నం చేస్తారు. నష్టవస్తు పరిజ్ఞానం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నం చేస్తారు. శత్రువులపై విజయం ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఋణ సంబంధాలలో జాగ్రత్త అవసరం. స్థిరాస్తులు పెంచుకునే ప్రయత్నం. వృత్తి విద్యలపై ఆసక్తి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. చిత్త చాంచల్యం పెరుగుతుంది. సంతానం వల్ల సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. సృజనాత్మకతను కోల్పోతారు. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : విద్యార్థులకు అనుకూల సమయం. పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు.   శ్రమతో సౌకర్యాల సాధన ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆహారంలో సమయపాలన అవసరం. సౌకర్యాల వల్ల సంతోషం కలుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : వ్యాపారస్తుల సహకారం లభిస్తుంది. వ్యాపార ప్రయాణాలు చేస్తారు. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. పరామర్శలు చేస్తారు. ప్రచార, ప్రసార సాధనాలు లాభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : మాటల వల్ల అనుకూలత కలుగుతుంది. వాగ్దానాలు నెరవేరుతాయి. కుటుంబంలో సంతోషం ఏర్పడుతుంది. వాక్‌చాతుర్యం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అన్ని రకాల సంతోషాలు ఏర్పడతాయి. నిల్వధనం పెంచుకునేప్రయత్నం. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అనుకోని ఇబ్బందులు ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. కష్టకాలం. పట్టుదలతో కార్యసాధన అవసరం. ఆలోచనలు బట్టి ప్రణాళికల్లో మార్పులు ఉంటాయి. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం.శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : అనవసర ఖర్చులు ఉంటాయి. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. నిద్రాభంగం ఉంటుంది. సుఖం కోసం ఆలోచిస్తారు. అనవసర ప్రయాణాలు చేస్తారు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వ్యాపారస్తులకు సమిష్టి ఆదాయాలు. అనుకూల సమయం. అన్నివిధాల లాభాలు వచ్చే అవకాశం. పెద్దల ఆశీస్సులుటాంయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. చేప్టిన పనుల్లో కార్యసాధన ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

 

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అధికారులతో అనుకూలత పెంచుకునే ప్రయత్నం. విద్యార్థులకు కష్టకాలం. ఉద్యోగస్తులు జాగ్రత్తపడే అవకాశం. పెద్దలంటే గౌరవం ఉంటుంది. పరాశ్రయం ఉంటుంది. ఇతరులపై దయ చూపిస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అన్ని పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. విద్యార్థులు అధిక శ్రమపడాలి. పరిశోధకులకు కష్టకాలం. ఇతరులపై ఆధారపడతారు. దూరదృష్టి కొంత తగ్గుతుంది. వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలు ఉండవు. సంతృప్తిలోపం. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అనుకోనిఆదాయాలు ఉంటాయి. శ్రమలేని సంపాదన వస్తుంది.  క్రయవిక్రయాలు అనుకూలిస్తాయి. చెడు మార్గాలవైపు దృష్టి పెడతారు. అనారోగ్య సూచనలు. అవమానాలు జరిగే సూచనలు జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios