Asianet News TeluguAsianet News Telugu

జాతకం... నా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా?

మాకు పంపిన కొందరి జాతకాల వివరాలు ఇక్కడ ఉన్నాయి

can i get good job according to my astro
Author
Hyderabad, First Published Mar 9, 2019, 10:42 AM IST

1. ఓం ప్రకాశ్‌

ఉద్యోగ ప్రయత్నాలు సరిగా ఫలించడం లేదు. వివాహం ఎప్పుడు అవుతుంది?

మీకు ప్రస్తుతం సమయం అంత అనుకూలంగా లేదు. జులై తర్వాత నుంచి అనుకూల సమయం ఉంటుంది. అప్పుడు మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహానికి చేసే ప్రయత్నాలు కూడా అప్పుడు నెరవేరుతాయి. కాని మీరు జీవితంలో దానధర్మాలు అధికంగా చేయాలి. అప్పుడు మాత్రమే మంచి ఎదుగుదల అనుకున్న గుర్తింపు వస్తాయి.

జపం : శ్రీ రాజమాతంగ్యై నమః, శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది

దానం : పళ్ళు/ విద్యార్థులకు పుస్తకాలు, 2. నూనె, పల్లీలు దానం చేయాలి.

2. ప్రవీణ్‌ కుమార్‌

ఉద్యోగం గురించి?

2021 ముగింపు వరకు మీకు అంత అనుకూలమైన సమయం కాదు. ప్రస్తుతం ఏదో ఒక చిన్న ఉద్యోగం వస్తుంది కాని దానిలో శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితం తక్కువగా ఉంటుంది. అందులో చేరవలసిందే. 2022లో మంచి సెటిల్లెమెంట్ ఉంటుంది. దానాలు ఎక్కువగా చేయాలి.

దానం : 1. అన్నదానం/ పాలు / పెరుగు/ తెలుపు వస్త్రాలు, 2. గోధుమపిండి/ గోధుమరవ్వ మొదలైనవి.

జపం :  శ్రీ రాజమాతంగ్యై నమః, హరహర శంకర, జయజయ శంకర జపం నిరంతరం చేయాలి.

సూచన : మీరు మీ జీవితాంతం యోగా కాని ఉదయం సాయంకాలలో వాకింగ్‌ కాని తప్పనిసరిగా చేయాలి. ప్రాణాయామాలు చేయాలి. నీరు అధికంగా తాగాలి. ఆహారాన్ని నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. లేకపోతే బద్ధకం వచ్చి అన్ని పనులు ఆగిపోతాయి. అభివృద్ధి ఉండదు. శరీరం సహకరించదు.

3. హరికృష్ణ

ఉద్యోగం ఎప్పుడు వస్తుంది. వివాహం ఎప్పుడు అవుతుంది?

మీ జాతకరీత్యా మీకు ఆలస్య వివాహ సూచన కనబడుతుంది. కావున తొందరపడరాదు. 2023 తర్వాత మాత్రమే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రస్తుతం ఏదో చిన్న ఉద్యోగం వస్తుంది. దానితో సరిపెట్టుకోవాలి. మీరు దానధర్మాలు అధికంగా చేయాలి.

దానం : కందిపప్పు/ కర్జూరాలు/ దానిమ్మపళ్ళు; 2. నూనె/ పల్లీలు, 3. అన్నదానం/ పాలు/ పెరుగు/ 4. గోధుమపిండి, చపాతీలు/ 5. ఆకుకూరలు, కూయగారలు, మొదలైనవి.

జపం : మంగళం భగవాన్‌ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్ష, మంగళాయతనం హరిః

హరహర శంకర, జయజయ శంకర జపాలు నిరంతరం చేసుకోవాలి.

4. శ్రీనివాసరావు వారి అమ్మాయి

ఏ ప్రొఫెషన్‌ ఎంచుకోవాలి.

మీ అమ్మాయికి ఇంజనీరింగ్‌ విద్య అయితే బావుంటుంది. అందులోనూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ వైపు అనుకూలంగా ఉంటుంది. 2020 జులై తర్వాత సమయం అన్నివిధాలా కలిసి వస్తుంది.

వివాహం అనుకున్న సమయంలో పూర్తికావడానికి మీరు దానాలు అధికంగా చేయాలి.

దానం : కందిపప్పు/ కర్జూరాలు/ దానిమ్మపళ్ళు, 2. నూనె/ పల్లీలు/ 3. కూరగాయలు/ ఆకుకూరలు, 4. గోధుమపిండి చపాతీలు దానం చేయాలి.

జపం : శ్రీదత్త శ్శరణం మమ జపం నిరంతరం చేసుకుంటూ ఉండాలి.

5. నవీన్‌

ఉద్యోగం గురించి?

ప్రస్తుతం అంత అనుకూలమైన సమయంకాదు. ఏదో ఒక చిన్న ఉద్యోగం వచ్చినా అందులో జాయిన్‌ కావాల్సిందు. 2021 ఏప్రిల్‌ తర్వాత జీవితంలో మంచి మార్పులు వస్తాయి. వివాహ విషయంలో ఎప్పికీ జాగ్రత్తగా ఉండాలి. తొందరపడకూదు. జీవిత భాగస్వామిని నిందించకూడదు.

జపం : శ్రీ రాజమాతంగ్యై నమః ; శ్రీరామ జయరామ జయజయ రామరామ మంచిది.

దానం : 1. గోధుమపిండి/ రవ్వ; 2. ఆకుకూరలు, కాయగూరలు, 3. నూనె/ పల్లీలు, 4. పళ్ళు/ విద్యార్థులకు పుస్తకాలు మొదలైనవి దానం చేయాలి.

6. భారతి

వివాహం అయ్యింది. జాతకం గురించి చెప్పండి?

ప్రస్తుతం మీకు అంత అనుకూల సమయం కాదు. ఆలోచనల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలఉరి పనికిరావు. 2021 అక్టోబర్‌ తర్వాత అనుకూల సమయం వస్తుంది. ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తున్నంద వాకింగ్‌, యోగా, ప్రాణాయామాలు తప్పనిసరి చేసుకోవాలి.

జపం : శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపంమంచిది. దుర్గా పూజ నిరంతరం చేసుకోండి.

దానం : ఇడ్లీ, వడలు దానం చేయాలి.

7. మణికంఠ

ఉద్యోగంమరియు  భవిష్యత్తు ఎలా ఉంటుంది.

మీకు ప్రస్తుతం ఒక సంవత్సరంపాటు సమయం అంత అనుకూలంగా లేదు. 2020 సెప్టెంబర్‌ తర్వాత అనుకూల సమయం. అప్పుడు ఉద్యోగంలో బావుంటుంది.

దానం :  1. గోధుమపిండి / రవ్వ/ చపాతీలు; 2. పళ్ళు/ విద్యార్థులకు పుస్తకాలు, 3. కూరగాయలు/ పెసరపప్పు, 4. నూనె / పల్లీలు మొదలైనవి దానం చేయాలి.

జపం : హరహర శంకర, జయజయ శంకర ; శ్రీ రాజమాతంగ్యై నమః జపం మంచిది.

8. సయ్యద్‌ మోహీద్‌

ఉద్యోగంలో మార్పుకు ఎలా ఉంటుంది?

మీకు ప్రస్తుతం సమయం అంత అనుకూలంగా లేదు. ఇప్పుడు ఏదైనా చేస్తున్న ఉద్యోగం ఉంటే దానిలోనే కొనసాగాలి. మార్పు ఇప్పుడప్పుడే కుదరదు. ఒత్తిడి అధికంగా ఉంటుంది. 2023 జూన్‌ తర్వాత మంచి మార్పులు వచ్చే సూచనలు ఉంటాయి.

దానం : మీకు జీవితంలో ఆదాయం కన్నా కూడా ఖర్చు అధికంగా ఉంటుంది. మీరు ముందుగా దానంచేయాలి.

దానం : 1. గోధుమపిండి/ చపాతీలు, 2. నూనె/ పల్లీలు/ 3. కందిపప్పు/ దానిమ్మపళ్ళు/ ఖర్జూరాలు/ 4. కూరగాయలు మొదలైన నిరంతరం దానం చేయాలి.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios