Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లక్ష్మీపార్వతి ఇచ్చిన సీట్లు ఇన్ని...

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 125 అసెంబ్లీ స్థానాలను, 19 నుంచి 22 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు జగన్ వైపు ఉన్నారని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. 

ysr congressparty leader lakshmi parvathi comments
Author
Hyderabad, First Published Apr 9, 2019, 4:52 PM IST


హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని ఆ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. జాతీయ చానెళ్ల సర్వేలు, వైసీపీ సర్వేలు వైసీపీ విజయాన్నే చెప్తున్నాయని ఆమె స్పష్టం చేశారు. 

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 125 అసెంబ్లీ స్థానాలను, 19 నుంచి 22 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు జగన్ వైపు ఉన్నారని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. 

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ మంచి మెజార్టీతో, ఓటింగ్ శాతంతో విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. టీడీపీతో పోలిస్తే వైసీపీకి 10శాతం ఓటింగ్ పెరిగిందని లక్ష్మీపార్వతి జోస్యం చెప్పారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనంతా మోసాలు, అబద్దాలే అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. 

ఎస్సీ, కాపుల ఓట్లు చీల్చేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని అందులో భాగంగానే కేఏ పాల్, పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దించారని లక్ష్మీపార్వతి స్పష్టం ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా గెలుపు మాత్రం జగన్ దేనని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు మేనిఫెస్టోని ఏపీ ప్రజలు నమ్మడం లేదన్నారు. నాయకుడు అంటే వైఎస్ లా ఉండాలని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రజలు చాలా తెలివైన వారని, చంద్రబాబు కుట్రలను తిప్పికొడతారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. 

2014 ఎన్నికల సమయంలో 650 హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. మరోసారి ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసేందుకు మరో మేనిఫెస్టోతో వచ్చారని లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ​​​

గతంలో హామీలనే అమలు చెయ్యకుండా మరో 150 అబద్దపు హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారని విరుచుకుపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ప్రకటించిన మేనిఫెస్టోనే 2009లో కూడా ప్రకటించారని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios