Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చంద్రబాబుతో భేటీ: త్వరలో టీడీపీలోకి

వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి  తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఆదివారం నాడు ఆయన  చంద్రబాబుతో సమావేశమయ్యారు.

 YSRCP MLC Janga krishna murthy Meets Chandrababu naidu lns
Author
First Published Apr 1, 2024, 6:43 AM IST

అమరావతి: వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ  జంగా కృష్ణమూర్తి  ఆదివారంనాడు బాపట్లలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును కలిశారు. జంగా కృష్ణమూర్తి  తెలుగుదేశం పార్టీలో చేరుతారని గత కొంత కాలంగా ప్రచారం సాగుతుంది.  గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి  జంగా కృష్ణమూర్తి  చంద్రబాబును కలిశారు.గురజాల అసెంబ్లీ స్థానం నుండి  జంగా కృష్ణమూర్తి పోటీ చేయాలని భావించారు.

జంగా కృష్ణమూర్తికి వైఎస్ఆర్‌సీపీ   టిక్కెట్టు కేటాయించలేదు.దరిమిలా  జంగా కృష్ణమూర్తి వైఎస్ఆర్‌సీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు.  దరిమిలా  టీడీపీ నేతలు  జంగా కృష్ణమూర్తితో టచ్ లోకి వెళ్లారు. గతంలో  మాజీ మంత్రి కొలుసు పార్థసారథితో  జంగా కృష్ణమూర్తి సమావేశమైన విషయం తెలిసిందే. అప్పట్లోనే  జంగా కృష్ణమూర్తి  టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగింది.కానీ కొన్ని కారణాలతో  చంద్రబాబుతో జంగా కృష్ణమూర్తి  భేటీ ఆలస్యమైంది.  ఆదివారం నాడు  జంగా కృష్ణమూర్తి  చంద్రబాబుతో సమావేశమయ్యారు.  త్వరలోనే జంగా కృష్ణమూర్తి  టీడీపీలో చేరనున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి  ఈ ఏడాది  మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం)లు కలిసి పోటీ చేయనున్నాయి. వైఎస్ఆర్‌సీపీ ఒంటరిగా బరిలోకి దిగింది.  2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చింది.ఈ ధఫా  వైఎస్ఆర్‌సీపీని అధికారం నుండి దించాలని  తెలుగుదేశం కూటమి  పట్టుదలతో ఉంది. మరో వైపు  రెండో దఫా అధికారాన్ని దక్కించుకోవాలని వైఎస్ఆర్‌సీపీ  వ్యూహాలు రచిస్తుంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios