Asianet News TeluguAsianet News Telugu

ఫలితాలు ఈవిఎంలెరుగు: జగన్ రిలాక్స్, చంద్రబాబు ఫ్రస్ట్రేషన్

ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదని గ్రహించిన చంద్రబాబు ఓటమిని నైతికంగా అంగీకరించక సాకులు వెతుకుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఈవీఎంలు చక్కగా పనిచేసినట్లు, ఓడిపోతారని తెలిస్తే అవి పనిచెయ్యలేదా ఇదేంటి చంద్రబాబూ అంటూ నిలదీస్తున్నారు.

YS Jagan in relaxed mood: Chandrababu in frustration
Author
Amaravathi, First Published Apr 17, 2019, 12:59 PM IST

హైదరాబాద్: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల పోరు ముగిసినప్పటికీ రాజకీయ పోరు మాత్రం క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికల ఫలితాలపై ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఎన్నికలపై ధీమాగా ఉన్నారు. 

ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఊపిరిసలపకుండా పర్యటించిన వైఎస్ జగన్ ఎన్నికల తర్వాత పూర్తిగా రిలీఫ్ అయ్యారు. పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. సైలెంట్ గా ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నారు. ఎన్నికలు అయిన తర్వాత ఒక్కసారే వైఎస్ జగన్ బయటకు వచ్చారు. 

అదికూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ నేతలు దాడులు చేశారని ఆరోపిస్తూ గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. అయితే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం రెస్ట్ తీసుకోవడం లేదు. 48 గంటల ముందు ఎన్నికల ప్రచారానికి స్వస్తి చెప్పిన చంద్రబాబు ఎన్నికల ముగిసిన తర్వాత ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. 

ఎన్నికలు ముగిసిన తర్వాత నేతలంతా టూర్లకు వెళ్తుంటే చంద్రబాబు మాత్రం ఈవీఎంలపై పోరుబాటకు దిగారు. ఈవీఎంల పనితీరుపై జాతీయ స్థాయి పార్టీలతో కలిసి ఉద్యమానికి సారథ్యం వహిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ హస్తినలో హల్ చల్ చేస్తున్నారు. 

అంతేకాదు కర్ణాటకలో జేడీఎస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈవీఎంలపై చంద్రబాబు అనుసరిస్తున్న తీరుపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో ఈవీఎంల ద్వారానే చంద్రబాబు ఎన్నికల్లో గెలుపొందారని అప్పుడు ఈవీఎంల పనితీరుపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 

ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదని గ్రహించిన చంద్రబాబు ఓటమిని నైతికంగా అంగీకరించక సాకులు వెతుకుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఈవీఎంలు చక్కగా పనిచేసినట్లు, ఓడిపోతారని తెలిస్తే అవి పనిచెయ్యలేదా ఇదేంటి చంద్రబాబూ అంటూ నిలదీస్తున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గెలుపుపై కాన్ఫిడెన్స్ తో ఉన్నారని కానీ చంద్రబాబులో మాత్రం ఆ కాన్ఫిడెన్స్ కనిపించడం లేదని ఆరోపిస్తోంది. అన్ని సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఫలితాలు ఇస్తుండటంతో చంద్రబాబు ప్రస్టేషన్లోకి వెళ్లిపోయారని విమర్శిస్తున్నారు. 

ఈసారి ఎన్నికల్లో 130 స్థానాలతో తమదే గెలుపు అంటూ చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఓటమి భయంతో చంద్రబాబు అంతేగా అంటే తనయుడు నారా లోకేష్ అంతేగా అంటూ ఎఫ్ 2 సినిమాను తలపిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చేసిన వ్యాఖ్యలు, ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిలపై చంద్రబాబు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఐఏఎస్ లపై చంద్రబాబు వ్యవహరించిన తీరు ఇప్పుడు గవర్నర్ వరకు వెళ్లింది. 

తాజాగా ద్వివేదిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపట్ల కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆరా తీస్తోంది. ఇలా చంద్రబాబు విమర్శలు ఎదుర్కోవడానికి కారణం ప్రస్టేషన్ అని విమర్శలు గుప్పుమంటున్నాయి. 

ఇదిలా ఉంటే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సైతం ఎన్నికల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ బూత్ లో ఓటు వేసిన అనంతరం నారా లోకేష్ ఓటర్లకు టీ, బిస్కెట్స్, మంచినీళ్లు కూడా ఏర్పాటు చెయ్యలేదంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. 

ఇకపోతే ఈసీపై చంద్రబాబు చేస్తున్న విమర్శలతోపాటు వీవీప్యాట్ల‌లోని 50 శాతం స్లిప్ ల‌ను లెక్కించాల‌న‌్న డిమాండ్లపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా 80శాతం ఓటింగ్ నమోదైతే  స‌గానికి పైగా ఈవీఎంలు పనిచెయ్యడం లేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారి తీశాయి. 

ఈవీఎంల‌లో ఓటు ఒక‌రికి వేస్తే, మ‌రో క పార్టీకి ప‌డుతోంద‌ని చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చెయ్యడంపై ఘాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు మాటల్లో కానీ, చేతల్లో కానీ ఏనాడు చెయ్యలేదని వీటన్నింటికి ప్రస్టేషన్ కారణమంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios