Asianet News TeluguAsianet News Telugu

నంద్యాల ఉపఎన్నికపై జనసేన స్టాండ్ ఏంటి?

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకుంటున్న పవన్ కు ఈ ఉపఎన్నిక ఒక ట్రైల్ రన్ లాంటిదనే అనుకోవచ్చు. జనసేనకు ప్రజల్లో ఉన్న బలమెంతో తెలుసుకోవటానికి ఇదే మంచి అవకాశం. ట్రైలు లేదూ రన్నూ అవసరం లేదు. మాదంతా ఒకటేసారి ఫైనలే అని పవన్ అనుకుంటే అది ఆయనిష్టం.

What is the stand of pawan kalyan on nandyala by poll

జనసేన అద్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యవహారశైలి విచిత్రంగా ఉంటుంది. అందరికీ సమస్యగా కనిపించింది పవన్ కు ఏమాత్రం పట్టదు. ఎవరూ పట్టించుకోని విషయంలో పవన్ విపరీతంగా స్పందిస్తారు. ఈ విషయం ఇప్పటికే అనేకమార్లు రుజువైంది కూడా. అందుకు తాజా ఉదాహరణ నంద్యాల ఉప ఎన్నికే. నంద్యాల ఉప ఎన్నికపై అధికార-ప్రధాన ప్రతిపక్షాల్లో జరుగుతున్న హడావుడి అంతా ఇంతా కాదు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకుంటున్న జనసేనలో మాత్రం ఏ హడావుడీ కనబడటం లేదు.

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను నంద్యాల ఉపఎన్నిక పట్టి ఊపేస్తోంది. టిడిపి, వైసీపీలైతే అభ్యర్ధి ఎంపిక, ఉప ఎన్నికల్లో గెలుపుపై తీవ్రస్ధాయిలో కసరత్తు చేసేస్తున్నాయ్. ఇరు పార్టీల అధినేతలూ మీటింగులు మీద మీటింగులూ పెట్టేసుంటున్నారు. నంద్యాలపై ఇంత హడావుడి జరుగుతున్నా జనసేన అధినత పవన్ కల్యాణ్ మాత్రం తనకేమి పట్టనట్లున్నారు.

వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలూ ఉన్నా వాటి ఉనికి అంతంతమాత్రమే కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకోవటం లేదు. ఇక, భారతీయ జనతా పార్టీ అంటారా అదెటూ టిడిపితోనే ఉంటుంది. కాబట్టి భాజపా గురించి ఆలోచించటానికి పెద్దగా ఏమీ లేదు. మిగిలింది ఒక్క జనసేన మాత్రమే. దాని గురించే ఈ చర్చంతా.

నంద్యాల ఉపఎన్నికలో జనసేన తరపున ఎవరైనా పోటీ చేస్తారా అన్న విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. ఒకవేళ పోటీ చేయకపోతే ఏ పార్టీకి పవన్ మద్దతు ఇస్తారు? ఆ విషయంలో కూడా ఎటువంటి ప్రకటనా లేదు. పోటీ చేసే ఉద్దేశ్యమూ లేక, ఎవరికీ మద్దతూ ఇవ్వకపోతే ఎలా?

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకుంటున్న పవన్ కు ఈ ఉపఎన్నిక ఒక ట్రైల్ రన్ లాంటిదనే అనుకోవచ్చు. జనసేనకు ప్రజల్లో ఉన్న బలమెంతో తెలుసుకోవటానికి ఇదే మంచి అవకాశం. ట్రైలు లేదూ రన్నూ అవసరం లేదు. మాదంతే ఒకటేసారి ఫైనలే అని పవన్ అనుకుంటే అది ఆయనిష్టం.

Follow Us:
Download App:
  • android
  • ios