Asianet News TeluguAsianet News Telugu

పోలీస్ వాహనం ఢీకొట్టి తప్పించుకొనే యత్నం: సినీ ఫక్కిలోనే విశాఖలో ఎంపీ ఫ్యామిలీ కిడ్నాపర్ల అరెస్ట్

విశాఖ ఎంపీ కుటుంబ సభ్యులతో పాటు ఆడిటర్ జీవీని కిడ్నాప్  చేసిన  కిడ్నాపర్లను  నాలుగు  గంటల్లో  అరెస్ట్  చేశారు. 

We tracked accused through mobile signal says visakhapatnam cp trivikram varma
Author
First Published Jun 15, 2023, 2:03 PM IST

విశాఖపట్టణం: ఎంపీ ఎంవీవీ  సత్యనారాయణ  కుటుంబ సభ్యులతో పాటు  ఆడిటర్ జీవీ  కిడ్నాపైన సమాచారం అందిన   నాలుగు గంటల్లోనే   నిందితులను  అరెస్ట్  చేశామని  విశాఖపట్టణం సీపీ త్రివిక్రమ్ వర్మ చెప్పారు.

గురువారంనాడు ఓ తెలుగు న్యూస్ చానెల్ తో  విశాఖపట్టణం సీపీ  త్రివిక్రమ్ వర్మ మీడియాతో మాట్లాడారు.  ఇవాళ  ఉదయం  ఎనిమిది గంటల సమయలో  విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ  భార్య, కొడుకు  , ఎంపీ ఆడిటర్  జీవీ కిడ్నాప్ అయినట్టుగా తమకు  సమాచారం అందిందన్నారు. 

ఫోన్ సిగ్నల్స్ ద్వారా  నిందితులు  ఎటు వైపు వెళ్తున్నారో  ట్రేస్ చేశామని విశాఖ సీపీ  త్రివిక్రమ్ వర్మ చెప్పారు.  పీఎంపాలెం  పోలీస్ స్టేషన్ వెనుక  వైపు నుండి నిందితులు వెళ్తున్న వాహనాన్ని గుర్తించి ఈ వాహనం వెనుక వైపు నుండి ముందుగా   మరో వాహనంతో అడ్డగించినట్టుగా  సీపీ తెలిపారు. ఈ క్రమంలో  పోలీస్ వాహనాన్ని ఢీకొట్టి నిందితులు  తప్పించుకొని ప్రయత్నం చేశారని  సీపీ తెలిపారు.  పారిపోతున్న ఇద్దరు నిందితులను  తమ సిబ్బంది  పట్టుకున్నారన్నారు.   ఈ సమయంలో  ఇద్దరు పోలీసులకు  స్వల్ప గాయాలయ్యాయాని సీపీ  త్రివిక్రమ్ వర్మ వివరించారు. ఈ ఇద్దరు నిందితుల నుండి తీసుకున్న సమాచారం ఆధారంగా  మరో వాహనంలో  తరలిస్తున్న ఎంపీ కుటుంబసభ్యులు ఆడిటర్ ను   రక్షించినట్టుగా సీపీ తెలిపారు. 

విశాఖకు చెందిన రౌడీషీటర్ హేమంత్ కుమార్ తో పాటు మరో ముగ్గురు నిందితులు  ఈ కిడ్నాప్ లో పాల్గొన్నారని  సీపీ చెప్పారు.ఈ కేసులో ఇద్దరిని  అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇంకా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామన్నారు.  విశాఖ ఎంపీ ఎంవీవీ కుటుంబ సభ్యులతో పాటు  ఆడిటర్ జీవీ కూడ క్షేమంగా ఉన్నాడని  సీపీ వివరించారు.హేమంత్ కుమార్ పై  ఇప్పటికే  రెండు కిడ్నాప్ కేసులు నమోదయ్యాయని సీపీ  చెప్పారు. ఇటీవలే జైలు నుండి హేమంత్ కుమార్ విడుదలైనట్టుగా   సీపీ తెలిపారు. 


also read:విశాఖలో కిడ్నాప్ కథ సుఖాంతం : నా భార్య, కొడుకు, ఆడిటర్ క్షేమంగా ఉన్నారు.. ఎంపీ ఎంవీవీ

విశాఖ  ఎంపీ  శరత్ ఇంటికి ఆమె తల్లిని  కిడ్నాపర్లు పిలిపించారు. విశాఖ ఎంపీ భార్య తో  ఆడిటర్ జీవీని  కూడ  కిడ్నాపర్లు పిలిపించినట్టుగా  పోలీసులు గుర్తించారని తెలుస్తుంది.  నిన్న ఉదయం నుండి  ఆడిటర్ జీవీ ఫోన్ ఎత్తకపోవడంతో  ఎంపీ  ఎంవీవీ  సత్యనారాయణ  విశాఖ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.   దీంతో ఈ కిడ్నాప్ అంశం వెలుగు  చూసింది.  ఈ కిడ్నాప్ జరిగిన సమయంలో విశాఖ ఎంపీ  ఎంవీవీ  సత్యనారాయణ  హైద్రాబాద్ లో ఉన్నాడు.  విషయం తెలుసుకున్న తర్వాత  ఆయన  హైద్రాబాద్ నుండి విశాఖపట్టణానికి బయలుదేరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios