Asianet News TeluguAsianet News Telugu

తిరుమలలో మరో రెండు చిరుతల కదలికలు: అప్రమత్తమైన టీటీడీ అధికారులు

తిరుమలలో మరో రెండు చిరుతలను  అటవీశాఖాధికారులు  గుర్తించారు. ట్రాప్ కెమెరాల్లో  చిరుతల కదలికలను  అధికారులు గుర్తించారు.

  Two  leopard  spotted  in Tirumala lns
Author
First Published Sep 7, 2023, 3:17 PM IST

తిరుపతి: తిరుమలలో  మరో రెండు  చిరుతలను  ఫారెస్ట్  అధికారులు    గుర్తించారు. ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు  చేసిన  ట్రాప్ కెమెరాాల్లో  చిరుతల సంచారాన్ని గురువారంనాడు గుర్తించారు అధికారులు. 
 ఇప్పటికే  ఐదు  చిరుతలను  ఫారెస్ట్ అధికారులు బంధించారు.  తాజాగా  మరో రెండు  చిరుతలను గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.  ఈ రెండు చిరుతలను బంధించేందుకు అధికారులు ఏర్పాట్లను ప్రారంభించారు.

తిరుమల నడక మార్గంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు  భద్రత కల్పించడంపై  టీటీడీ దృష్టి కేంద్రీకరించింది. నడక మార్గం గుండా  శ్రీవారి ఆలయానికి వస్తున్న భక్తులకు కర్రలను  పంపిణీ  చేస్తున్నారు. మరో వైపు చిరుతలను బంధించే ఏర్పాట్లు చేపట్టారు.ఈ ప్రాంతంలో చిరుతల సంఖ్య ఎందుకు  పెరిగిందనే విషయమై  ఫారెస్ట్ అధికారులు  ఆరా తీస్తున్నారు. 

ఈ ఏడాది  ఆగస్టు  28న ఫారెస్టు అధికారులు  ఏర్పాటు చేసిన  బోనులో  పులి చిక్కింది.  వారం రోజుల పాటు  ఈ చిరుత పులి  ఫారెస్ట్ అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది.   అంతకుముందు  ఆగస్టు  17న  లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద  ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన   బోనులో మరో చిరుత చిక్కింది.ఆగస్టు  14న  అలిపిరి మెట్ల మార్గంలో  మరో చిరుతను అధికారులు  బంధించారు. అంతకు ముందే మరో చిరుతను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఇవాళ  మరో చిరుతను  ఫారెస్ట్ అధికారులు  బంధించారు. 

ఇదిలా ఉంటే ఇవాళ మరో రెండు చిరుతల సంచారాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.  ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో  ఈ చిరుతల కదలికలను అటవీశాఖాధికారులు గుర్తించారు.  ఈ రెండు చిరుతలను  బంధించేందుకు  అధికారులు  ప్రయత్నాలను ప్రారంభించారు.

Follow Us:
Download App:
  • android
  • ios