Asianet News TeluguAsianet News Telugu

తిరుపతి: కుప్పకూలిన టీటీడీ ఆర్చి.. తప్పిన పెను ప్రమాదం

తిరుపతిలోని రామానుజ సర్కిల్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాటు చేసిన స్వాగత తోరణం (ఆర్చి) ఆదివారం కూలింది. నగరంలోని రిలయన్స్‌ మార్ట్‌ వద్ద ఉండే ఆర్చి కూలడంతో రెండు కార్లు ధ్వంసమయ్యాయి

ttd arch collapsed in tirupati
Author
Tirupati, First Published Sep 19, 2021, 2:52 PM IST

తిరుపతిలోని రామానుజ సర్కిల్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాటు చేసిన స్వాగత తోరణం (ఆర్చి) ఆదివారం కూలింది. నగరంలోని రిలయన్స్‌ మార్ట్‌ వద్ద ఉండే ఆర్చి కూలడంతో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో పాటు ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. లారీ తగలడం వల్లే ఆర్చి కూలినట్లుగా తెలుస్తోంది. గరుడ వారధి నిర్మాణ పనుల సమయంలో ఈ తోరణం పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. సమాచారం అందుకున్న అధికారులు ఆర్చిని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios