Asianet News TeluguAsianet News Telugu

ఈ నెల 18 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఈ రోజుల్లో ప్రత్యేక దర్శనాలకు అనుమతి ఉండదు..

Tirumala: తిరుమ‌ల తిరుప‌తి దేశ‌స్థానం (టీటీడీ) శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అన్ని ఏర్పాట్లు చేస్తోంద‌ని సంబంధిత అధికారులు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవాలయ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ నెల 18న స్వామి వారికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌త్యేక ద‌ర్శ‌నాల గురించి కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. 
 

Tirumala Brahmotsavam to commence from September 18, Special darshans are not allowed these days RMA
Author
First Published Sep 1, 2023, 3:57 AM IST

Tirumala Tirupati Desa Sthanam (TTD) : తిరుమ‌ల తిరుప‌తి దేశ‌స్థానం (టీటీడీ) శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అన్ని ఏర్పాట్లు చేస్తోంద‌ని సంబంధిత అధికారులు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ధర్మారెడ్డి తెలిపారు. ఈ నెల 18న స్వామి వారికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌త్యేక ద‌ర్శ‌నాల గురించి కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు.

వివ‌రాల్లోకెళ్తే.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బ్ర‌హ్మోత్స‌వాల కార‌ణంగా ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు ఉండ‌వని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం బ్రహ్మోత్సవాల సందర్భంగా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయడంతోపాటు లాకర్లు ఏర్పాటు చేయనున్నట్లు వివ‌రించారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ధర్మారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 18న స్వామివారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారనీ, గరుడసేవ రోజు రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

భక్తులకు వైద్యం అందుబాటులో ఉండేలా రుయా ఆస్పత్రి నుంచి సిబ్బందిని రప్పిస్తామన్నారు. ఘాట్ రోడ్డులో 24 గంటల పాటు ఆర్టీసీ బస్సులు తిరుగుతాయని తెలిపారు. వన్యప్రాణుల సంచారం దృష్ట్యా పాదచారులు, ఘాట్ రోడ్లపై ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. అటవీశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం నడకదారిలో నిబంధనలు సడలించనున్నారు. శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను గురించి వివ‌రిస్తూ.. సెప్టెంబరు 18న సాయంత్రం అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. అధికమాసం కారణంగా ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు ఉంటాయనీ, సెప్టెంబర్ 22న గరుడసేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజారోహణం నిర్వహించనున్నట్లు తెలిపారు. వేడుకల సమయంలో రద్దీని ఎదుర్కొనేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తామనీ , వారంలో ఎటువంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని ఆయన పేర్కొన్నారు.

కాాగా, ఇటీవల తిరుమలలో చిరుతల సంచారం, భక్తులపై దాడి చేయడంతో తీవ్ర భయాందోళనలు చోటుచేసుకున్నాయి. అయితే,  ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతలు రెండు బోనులో చిక్కాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అలాగే, భక్తుల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని తిరుమ తిరుపతి దేశస్థానం అధికారులు పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios