Asianet News TeluguAsianet News Telugu

పూతలపట్టు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా గతంలో వున్న వేపంజరి, పుత్తూరు నియోజకవర్గాలు రద్దయి వాటి స్థానంలో పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన పూతలపట్టులో మొత్తం ఓటర్ల సంఖ్య 2,21,038 మంది. 2009లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ ఒకసారి, వైసీపీ రెండు సార్లు విజయం సాధించింది. పూతలపట్టులో హ్యాట్రిక్ విజయం సాధించాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు బదులుగా మాజీ ఎమ్మెల్యే ఎం సునీల్ కుమార్‌కు జగన్ టికెట్ కేటాయించారు. సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కలికిరి మురళీమోహన్‌ను అభ్యర్ధిగా ప్రకటించారు.

Puthalapattu Assembly elections result 2024 ksp
Author
First Published Mar 27, 2024, 6:08 PM IST

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గం విభిన్న వాతావరణం వుంటుంది. తమిళనాడు సరిహద్దుకు అత్యంత చేరువలో వుండే ఈ నియోజకవర్గంలో మిక్స్‌డ్ కల్చర్ వుంటుంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా గతంలో వున్న వేపంజరి, పుత్తూరు నియోజకవర్గాలు రద్దయి వాటి స్థానంలో పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ సెగ్మెంట్ పరిధిలో పూతలపట్టు, ఐరాల, తవనంపల్లె, బంగారుపాలెం, యాదమర్రి నియోజకవర్గాలున్నాయి. పుత్తూరులో ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన గాలి ముద్దుకృష్ణమనాయుడు నగరిలో ఆరో విజయం అందుకున్నారు. 

పూతలపట్టు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. ఇప్పటి వరకు గెలవని టీడీపీ : 

ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన పూతలపట్టులో మొత్తం ఓటర్ల సంఖ్య 2,21,038 మంది. వీరిలో పురుషులు 1,09,424 మంది.. మహిళలు 1,11,606 మంది. పూతలపట్టు సెగ్మెంట్ పరిధిలోని ఐదు మండలాల్లో మామిడి తోటలను రైతులను అధికంగా సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచి దేశవిదేశాలకు మామిడి కాయలు ఎగుమతి అవుతాయి. ఇక ఐరాల మండలంలోని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వెలసిన కాణిపాకం ఆలయానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వుంది. యాదవ, గాండ్ల, మొదలియార్, గౌండర్, ఎస్సీ సామాజికవర్గాలు పూతలపట్టులో బలంగా వున్నాయి. 

2009లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ ఒకసారి, వైసీపీ రెండు సార్లు విజయం సాధించింది. 2009లో కాంగ్రెస్ తరపున పీ రవి ఎన్నికవ్వగా.. 2014లో వైసీపీ అభ్యర్ధి ఎం సునీల్ కుమార్.. 2019లో అదే పార్టీకి చెందిన ఎంఎస్ బాబులు గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఎంఎస్ బాబుకు 1,03,265 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి ఎల్ లలిత కుమారికి 74,102 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 29,163 ఓట్ల తేడాతో వరుసగా రెండోసారి పూతలపట్టులో విజయం సాధించింది. 

పూతలపట్టు శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. హ్యాట్రిక్‌పై వైసీపీ కన్ను :

2024 ఎన్నికల విషయానికి వస్తే.. పూతలపట్టులో హ్యాట్రిక్ విజయం సాధించాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు బదులుగా మాజీ ఎమ్మెల్యే ఎం సునీల్ కుమార్‌కు జగన్ టికెట్ కేటాయించారు. ఎంఎస్ బాబు ఆధిపత్య ధోరణి కేడర్‌కు నచ్చకపోవడంతో ఆయనకు నో చెప్పారు సీఎం. టీడీపీ విషయానికి వస్తే.. పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి పసుపు జెండా ఇక్కడ ఎగరలేదు.

ఈసారి ఎలాగైనా ఇక్కడ గెలవాలని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కలికిరి మురళీమోహన్‌ను అభ్యర్ధిగా ప్రకటించారు. మండల, నియోజకవర్గ స్థాయిలో కేడర్‌ను కలుపుకుని ముందుకు పోవడంతో పాటు దళితవాడల్లో పల్లె నిద్ర వంటి కార్యక్రమాలను మురళీమోహన్ చేపట్టారు. జగన్ పాలనపై వ్యతిరేకత, టీడీపీ జనసేన బీజేపీ కూటమి తనకు కలిసొస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios