Asianet News TeluguAsianet News Telugu

పాయకరావుపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

ఆంధ్ర ప్రదేశ్ లో ఎస్సీలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గాల్లో పాయకరావుపేట ఒకటి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైసిపి గెలిచింది... గొల్ల బాబూరావు ప్రస్తుత ఎమ్మెల్యే. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేయుడిగా వున్న బబూరావును రాజ్యసభకు పంపిస్తున్నారు.  కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మరో అభ్యర్థిని పాయకరావుపేట బరిలో నిలిపింది వైసిపి. 

Payakaraopet assembly elections result 2024 AKP
Author
First Published Mar 26, 2024, 6:08 PM IST

పాయకరావుపేట నియోజకవర్గ రాజకీయాలు :

ఉత్తరాంధ్రలో తెలుగుదేశం, వైసిపి రెండూ బలంగా వున్న నియోజకవర్గం పాయకరావుపేట. టిడిపి ఆవిర్భావం నుండి 2009 వరకు పాయకరావుపేటలో టిడిపికి ఎదురేలేదు.  1983 లో సుమన గంతేల, 1985, 1989, 1994  కాకర నూకరాజు, 1999, 2004 లో చెంగల వెంకటరావు టిడిపి తరపున పోటీచేసి వరుస విజయాలు అందుకున్నారు. 2014 లో వంగలపూడి అనిత విజయం సాధించారు. 

ఇక ప్రస్తుత పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా పనిచేసారు. 2009 లో పాయకరావుపేట నుండి గెలిచిన బాబూరావు వైఎస్ జగన్ పార్టీ పెట్టడంతో రాజీనామా చేసిమరి అందులో చేరారు. ఇలా 2012 లో జరిగిన ఉపఎన్నికల్లో ఆయన మళ్ళీ గెలిచారు. 

అయితే మొదటినుండి తనవెంట వున్న బాబూరావును రాజ్యసభకు పంపించారు వైఎస్ జగన్. దీంతో ఈసారి పాయకరావుపేటలో కంబాల జోగులు వైసిపి అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. టిడిపి మాత్రం వంగలపూడి అనితనే మరోసారి బరిలో దింపింది.

పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని  మండలాలు :

1. కోటవురేట్ల
2. నక్కపల్లి 
3.  పాయకరావుపేట
4.  ఎస్. రాయవరం

పాయకరావుపేట అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) -  2,40,678
పురుషులు -    1,19,330
మహిళలు ‌-    1,21,346

పాయకరావుపేట అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

పాయకరావుపేట అసెంబ్లీ విషయంలో వైసిపి సంచలన నిర్ణయం తీసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు రాజ్యసభకు పంపించి   కంబాల జోగులుకు పాయకరావుపేట సీటు ఇచ్చింది.  

టిడిపి అభ్యర్థి : 

తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మరోసారి పాయకరావుపేటలో పోటీ చేస్తున్నారు. 2014 లో ఇక్కడినుండి పోటీచేసి గెలిచిన ఆమె 2019 లో మాత్రం బాబూరావు చేతిలో ఓడిపోయారు. 

పాయకరావుపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

పాయకరావుపేట అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -  1,95,725 (81 శాతం) 

వైసిపి - గొల్ల బాబూరావు - 98,745 ఓట్లు (50 శాతం) - 31,189 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - బి. బంగారయ్య - 67,556 ఓట్లు (34 శాతం) - ఓటమి

జనసేన పార్టీ - నక్కా రాజాబాబు - 15,921 (8 శాతం)

పాయకరావుపేట అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,79,843 ఓట్లు (80 శాతం)

టిడిపి  - వంగలపూడి అనిత - 86,355 (48 శాతం) - 2,828 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - చంగాల వెంకటరావు - 83,527 (46 శాతం) - ఓటమి


 

Follow Us:
Download App:
  • android
  • ios