Asianet News TeluguAsianet News Telugu

సామాన్యుడితో పవన్ రైలు యాత్ర

ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు స్వాతంత్ర్య ఉద్యమంలో జాతిపిత మహాత్మగాంధీజీ ఏ రైలుయాత్ర అయితే చేపట్టారో అదే యాత్రకు శ్రీకారం చుట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రరాజకీయాల్లో ఎన్నడూ లేనివిధంగా సరికొత్త రీతిలో ప్రజాపోరాట యాత్ర చేపట్టనున్నారు జనసేనాని. 

pawan Kalyan rail yatra schedule
Author
Vijayawada, First Published Nov 2, 2018, 12:01 PM IST

విజయవాడ: ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు స్వాతంత్ర్య ఉద్యమంలో జాతిపిత మహాత్మగాంధీజీ ఏ రైలుయాత్ర అయితే చేపట్టారో అదే యాత్రకు శ్రీకారం చుట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రరాజకీయాల్లో ఎన్నడూ లేనివిధంగా సరికొత్త రీతిలో ప్రజాపోరాట యాత్ర చేపట్టనున్నారు జనసేనాని. 

 ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి తూర్పుగోదావరి జిల్లా తుని వరకు ప్రజలతో కలిసి రైలులో ప్రయాణించనున్నారు. ఈ యాత్ర మధ్యాహ్నం 1.20 గంటలకు విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమై సాయంత్రం 5.20 నిమిషాల వరకు కొనసాగుతుంది. 

ఇప్పటి వరకు దేశంలో రైలు యాత్రలు చేపట్టిన పార్టీ అధినేతలలో పవన్ ఒకరు. జాతిపిత మహాత్మగాంధీలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని పవన్ కళ్యాణ్ రైలు యాత్రకు శ్రీకారం చుట్టారు. రైలులో ప్రయాణిస్తూ అసంఘటిత కార్మికులతోనూ ప్రయాణికులతోనూ పవన్ మమేకం కానున్నారు. 

జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో 1.20 నిమిషాలకు బయలుదేరనున్న పవన్ కళ్యాణ్ విజయవాడలో రైల్వే కార్మికులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లా నూజివీడు రైల్వేస్టేషన్లో మామిడి రైతులతో సమావేశం కానున్నారు. మామిడి రైతులు ఎగుమతులపై ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ తెలుసుకోనున్నారు. 

అనంతరం పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో కూడా ప్రజలతో మమేకం కానున్నారు. తదనంతరం తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, సామర్లకోటలలో పవన్ కళ్యాణ్ ప్రజలతో సమావేశమై వారి ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరాతీయనున్నారు. 

అలా సాయంత్రం 5.20 నిమిషాల వరకు పవన్ కళ్యాణ్ రైలు యాత్ర కొనసాగనుంది. ఆ తర్వాత తుని చేరుకుని తునిలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. 

రైలు యాత్ర సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలకు పలు కీలక సూచనలు చేసింది. ప్రతి జనసేన కార్యకర్త ప్లాట్ ఫాం టిక్కెట్ కొనుగోలు చేసి రావాలని రైలులో ప్రయాణించే వారు టిక్కెట్ తీసుకోవాలని కోరారు. ప్రయాణికులకు, రైల్వే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తనియ్యొద్దని  హితవు పలికారు. క్రమశిక్షణకు మారుపేరుగా జనసేనానిలు నడుచుకోవాలని పిలుపునిచ్చారు.  


 

Follow Us:
Download App:
  • android
  • ios