Asianet News TeluguAsianet News Telugu

నెల్లూరులో మైనర్ బాలికపై యాసిడ్ దాడి: పోలీసుల అదుపులో నిందితుడు, బాలిక పరిస్థితి విషమం

నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం నక్కలగుట్టలో 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై యాసిడ్ దాడి చేయడంతో పాటు గొంతుకోసిన నిందితుడు నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

Nellore Police Detained Nagaraju For Acid attack on 9th Class girl student
Author
First Published Sep 6, 2022, 9:51 AM IST

నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని  వెంకటాచలం మండలం నక్కలగుట్టలో 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక గొంతు కోసి యాసిడ్ దాడికి దిగిన నిందితుడు నాగరాజును మంగళవారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సోమవారం నాడు రాత్రి బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన్ని అదనుగా చూసుకొని  నాగరాజు అనే యువకుడు ఇంట్లోకి వెళ్లాడు. బాలికపై అత్యాచాారానికి ప్రయత్నించాడు. అయితే బాలిక ప్రతిఘటించింది. దీంతో బాలికపై యాసిడ్ పోశాడు. బాలిక కేకలు వేస్తుండడంతో కత్తితో గొంతు కోసి పారిపోయినట్టుగా పోలీసులు చెబుతున్నారు. బాలిక చెప్పిన సమాచారం మేరకు పోలీసులు నిందితుడు నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

also read:నెల్లూరు జిల్లాలో దారుణం: మైనర్ బాలిక గొంతు కోసి యాసిడ్ దాడి, బాలిక పరిస్థితి విషమం

బాధితురాలి కేకలు విన్న స్థానికులు వెంటనే ఆ ఇంట్లోకి వచ్చి చూశారు. రక్తం మడుగులో ఉన్న బాలికను స్థానికులు గుర్తించారు. వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాలికకు చికిత్స అందిస్తున్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.  ఈ విషయం తెలిసిన వెంటనే ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘటన స్థలాన్ని నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు పరిశీలించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios