Asianet News TeluguAsianet News Telugu

కొణతాల రామకృష్ణ : బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

Konathala Ramakrishna Biography:  రెండు దశాబ్దాలపాటు ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలు శాసించిన నాయకుడు. ఆయన వైయస్సార్ మరణం తర్వాత వైసిపిలో చేరారు. కానీ అక్కడి రాజకీయాలతో విసుగు చెందిన ఆయన  2019 ఎన్నికల ముందు టీడీపీకి మద్దతు ప్రకటించారు. ఇటీవల జనసేన పార్టీలో చేరిన ఆయన 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు మీ కోసం.. 
 

Konathala Ramakrishna Biography, Childhood, Family, Education, Political Life, Net Worth, Key Facts KRJ
Author
First Published Mar 28, 2024, 4:04 AM IST

Konathala Ramakrishna Biography:  రెండు దశాబ్దాలపాటు ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలు శాసించిన నాయకుడు. ఆయన వైయస్సార్ మరణం తర్వాత వైసిపిలో చేరారు. కానీ అక్కడి రాజకీయాలతో విసుగు చెందిన ఆయన  2019 ఎన్నికల ముందు టీడీపీకి మద్దతు ప్రకటించారు. ఇటీవల జనసేన పార్టీలో చేరిన ఆయన 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు మీ కోసం.. 
  
బాల్యం, విద్యాభ్యాసం

కొణతాల రామకృష్ణ 1957 జనవరి 4న అనకాపల్లిలో జన్మించారు. ఆయన తండ్రి పేరు కొనతాను సుబ్రమణ్యం. రామకృష్ణ విద్యాభ్యాసం అనకాపల్లిలోనే జరిగింది అనకాపల్లి మర్చంట్స్ అసోసియేషన్ లింగమూర్తి కాలేజీలో అభ్యసించారు. ఆంధ్ర విద్యాలయం నుంచి ఎం కామ్ లో పీజీ చేశారు. ఆ తర్వాత వ్యాపారాన్ని మొదలుపెట్టి సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో 1982లో పద్మావతి గారితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు 

రాజకీయ ప్రవేశం

కొణతాల రామకృష్ణ రాజకీయ జీవితం 1980వ దశకంలో ప్రారంభమైంది. రాజకీయాలపై ఆసక్తితో ఆయన తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన పి.అప్పలనరసింహంపై కేవలం 9 ఓట్ల మెజారిటీతో గెలిచి.. తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. తిరిగి 1991లో పదవ లోక్‌సభకు అనకాపల్లి నియోజకవర్గం నుండి ఎన్నికైనాడు. 1990, 1992 సంవత్సరాలలో విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైనాడు.1996లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతిలో 50వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. 

1999లో అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన ఆయన టీడీపీ అభ్యర్థి దాడి వీరభద్రరావు చేతిలో ఓటమి పాలయ్యారు. అయినా.. రాజకీయాలలో వెనుతిరగకుండా.. 2004లో దాడి వీరభద్రరావుపై 17వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనాడు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్ .. కొణతాల రామకృష్ణను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖను నిర్వహించాడు. కానీ, 2009లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన ఆయన ప్రజా రాజ్యం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఓడిపోయారు. 

వైసీపీలో చేరిక 

వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన రామకృష్ణ అతని మరణానంతరం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు.  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో విశాఖ పార్లమెంటు ఇన్‌ఛార్జిగా వ్యవహరించాడు. విశాఖ ఎంపీగా పోటీ చేసిన  వై.ఎస్. విజయమ్మ ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించాడు. విశాఖపట్నం,అనకాపల్లి జిల్లా రాజకీయాల్లో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు.  2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని చాలామంది భావించారు. కానీ ఆయన రాజకీయంగా ఏ పార్టీలో చేరలేదు .2019 ఎన్నికల ముందు టీడీపీకి మద్దతు ప్రకటించారు. కానీ ఆయన ఆ పార్టీలోనూ కొనసాగిలేదు. 

జనసేనలో చేరిక

ఇక 2024 ఎన్నికల్లో మాత్రం ఆయన పొలిటికల్ వార్ కు సిద్దమయ్యారు. జనవరి 25న జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన తొలి జాబితాలో కొణతాల రామకృష్ణ పేరు ప్రకటించారు. ఎంపీగా పని చేస్తున్నందున అనకాపల్లి ఎంపీగానే తిరిగి పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే అందుకు భిన్నంగా అనకాపల్లి శాసనసభ్యుడిగా ఆయన పోటీకి దిగుతున్నారు జనసేన, టిడిపి, బిజెపి పొత్తులో భాగంగా అనకాపల్లి అసెంబ్లీ టికెట్ పై పోటీ చేయనున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios