Asianet News TeluguAsianet News Telugu

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి, ఎనిమిది మందికి గాయాలు

చిత్తూరు జిల్లాలో  ఇవాళ జరిగిన  రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.  లారీ, కారు, బైక్  ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంపై  పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

Five killed in Road Accident in Chittoor District lns
Author
First Published Sep 8, 2023, 11:41 AM IST

తిరుపతి:చిత్తూరు జిల్లాలో  శుక్రవారంనాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.వడమాల చెక్ పోస్టు వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ లారీ  రోడ్డుకు అడ్డంగా పడింది.  అదే మార్గంలో వస్తున్న కారు ... రోడ్డుకు అడ్డంగా పడిన  లారీని ఢీకొట్టింది. దీంతో  కారులోని ఇద్దరు మృతి చెందారు. ఇదే మార్గంలో  వస్తున్న  బైక్ కూడ  రోడ్డుకు అడ్డంగా పడిన  లారీ, కారును ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో  మరో ఎనిమిది మంది  గాయపడ్డారు.గాయపడిన వారిని నగరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  రోడ్డుపై ఆగి ఉన్న లారీని మరో లారీ, కారు, బైక్ ఢీకొట్టడంతో  ఈ ప్రమాదం జరిగిందని  అధికారులు చెబుతున్ారు.

.  దేశ వ్యాప్తంగా  ప్రతి రోజూ ఏదో ఒక చోట  రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.  డ్రైవర్ల అజాగ్రత్త, నిర్లక్ష్యం కారణంగా  రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని  అధికారులు చెబుతున్నారు.  రోడ్డు ప్రమాదాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నా కూడ  ఆశించిన మేర ఫలితం దక్కని పరిస్థితి నెలకొంటుంది. 

ఈ ఏడాది ఆగస్టు 24న నేపాల్ లోని బారా జిల్లాలో జరిగిన  రోడ్డు ప్రమాదంలో  ఆరుగురు మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు.మృతి చెందిన వారిలో  భారతీయులు కూడ ఉన్నారు.  ఖాట్మాండ్ నుండి జనక్ పుర వైపు వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడింది. దీంతో బస్సులోని  ఆరుగురు మరణించారు.ఈ ఏడాది ఆగస్టు 25న  కేరళ వాయనాడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది.అదుపు తప్పిన  జీపు లోయలో పడిపోవడంతో  జీపులోని  తొమ్మిది మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో  జీపులో  12 మంది ఉన్నారు.

ఈ ఏడాది ఆగస్టు  30న బీహార్ రాష్ట్రంలోని రోహతాస్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఢీల్లీ-కోల్‌కత్తా  జాతీయ రహదారిపై  ఈ ప్రమాదం జరిగింది.ఈ నెల 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో జరిగిన  రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆటో, లారీ ఢీకొన్న  ఘటనలో  ఐదుగురు చనిపోయారు.ఘటనస్థలంలో ముగ్గురు మృతి చెందారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  మరో ఇద్దరు మృతి చెందారు.

ఈ నెల  4వ తేదీన కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగిన  రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 48వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.తమిళనాడు  రాష్ట్రంలోని సేలం జిల్లాలో ఈ నెల  6వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఆరుగురు మృతి చెందారు. 

Follow Us:
Download App:
  • android
  • ios