Asianet News TeluguAsianet News Telugu

TTD Darshan Tickets Scam: తిరుప‌తిలో న‌కిలీ టిక్కెట్ల ముఠా గుట్టు రట్టు

తిరుప‌తి శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నకిలీ దర్శన టికెట్ల  ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ టికెట్టు అమ్ముతున్న దుండ‌గులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ప్ర‌ధాన ప్రాత పోషించిన ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ కృష్ణారావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నకిలీ టికెట్లను తయారీలో కానిస్టేబుల్‌ కృష్ణారావు  పాత్ర ఉన్న‌ట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇందులో టీటీడీ మాజీ ఉద్యోగులే ఉంట‌డం గ‌మ‌నార్హం. 
 

Fake TTD Darshan Tickets Scam Gang Identify By Ttd Vigilance Officer
Author
Hyderabad, First Published Jan 4, 2022, 4:25 AM IST

TTD Darshan Tickets Scam:  తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో నకిలీ దర్శన టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లను అమ్మే ముఠాను అధికారులు పట్టుకున్నారు. ఈ ముఠాతో ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ కృష్ణారావుపై చేతులు క‌లిపిన‌ట్టు గుర్తించారు.  ఆయ‌న‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ కృష్ణ‌రావు నకిలీ టికెట్లను తయారు చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.  మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు భక్తులను 7 వేల చొప్పున 21వేలకు మూడు నకిలీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నకిలీ టికెట్ల వ్యవహారం ఎప్పటినుంచి జరుగుతుందనే దానిపై విజిలెన్స్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

లడ్డూ కౌంటర్ పనిచేసే అరుణ్ రాజు, ప్రత్యేక దర్శనం కౌంటరు ఉద్యోగి నరేంద్ర ఇద్దరు ఉద్యోగులు కృష్ణారావుకు సహకరించినట్లు అధికారులు గుర్తించారు. వీరిద్ద‌రూ స‌హ‌యంతో  న‌కిలీ టిక్కెట్ల దండా జరిగింద‌నీ, వీరిద్ద‌రూ న‌కిలీ టికెట్లను స్కానింగ్ చేయకుండానే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ టికెట్ల ముఠా క‌ట్టు అయితే.. తెలంగాణకు చెందిన మరో భక్త బృందానికి కూడా 3300 చొప్పున నాలుగు ప్రత్యేక దర్శనం టికెట్లను అమ్మిన‌ట్టు తెలుస్తోంది . ఈ ముఠాలో అందరూ టీటీడీ మాజీ ఉద్యోగులే ఉండటం గమనార్హం.

Read Also : పీఆర్సీపై పీటముడి: ఉద్యమానికి సిద్దమౌతున్న ఉద్యోగ సంఘాలు

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ కు చెందిన నలుగురు భక్తులు శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. ఈ క్ర‌మంలో ఈ ముఠా.. దర్శనం టికెట్లు ఇప్పిస్తామని చెప్పి రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్‌కు రూ.3300 చొప్పున వసూలు చేసి నకిలీ టికెట్లు భక్తులకు ఇచ్చి తిరుమల శ్రీవారి దర్శనానికి పంపారు. టీడీపీ జారీ చేసే ప్రత్యేక ప్రవేశ దర్శనం ( ఎస్ఈ డీ) టికెట్లను స్కాన్ చేయ‌ల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో ఎలాంటి స్కాన్ లేకుండా పంపించ‌డంపై భ‌క్తులకు అనుమానాలు రావ‌డంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ముఠాలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ తో పాటు.. గతంలో త్రిలోక్ ఏజెన్సీ టికెట్ల కౌంటర్లలో పని చేసిన బాయ్స్ ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

 Read Also : ప్రత్యేక హోదాతో పాటు విభజన హమీలు అమలు చేస్తే ఊరట: మోడీతో జగన్ భేటీ

ఈ క్ర‌మంలో  సీవీ ఎస్వో గోపీనాథ్ జెట్టి  మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు tirupati balaji.ap.gov.in వెబ్సైట్ లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భక్తులను మోసగించి..నకిలీ టికెట్లు అంటగట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు
 

Follow Us:
Download App:
  • android
  • ios