Asianet News TeluguAsianet News Telugu

చిత్తూరులో విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి


చిత్తూరు  జిల్లాలోని  ధర్మపురిలో  విద్యుత్  తీగలు తగిలి  ఏనుగు  మృతి చెందింది .

Elephant  Dies of  Electrocution  in Chittoor  Distirct lns
Author
First Published Mar 19, 2023, 9:47 AM IST

తిరుపతి: చిత్తూరు జిల్లాలోని  ధర్మపురిలో  విద్యుత్ తీగలు తగిలి  ఆదివారం నాడు  ఏనుగు  మృతి చెందింది .   వేటగాళ్లు  ఏనుగుల కోసం విద్యుత్  తీగలను  ఏర్పాటు  చేశారా, లేక  పొరపాటున విద్యుత్ తీగలు తెగి  ఏనుగు  మృతి చెందిందా  అనే కోణంలో పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. 

దేశంలోని  పలు రాష్ట్రాల్లో    ఇదే తరహలో  ఏనుగులు  మృతి చెందిన ఘటనలు   గతంలో  కూడా  చోటు  చేసుకున్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని  ధర్మపురి జిల్లాలో  పొలం వద్ద  ఏర్పాటు  చేసిన విద్యుత్  తీగలు తగిలి మూడు ఏనుగులు మృతి చెందాయి.   ఈ ఘటన  ఈ నెల ఏడో తేదీన  ధర్మపురి జిల్లా కొట్టాయ్ గ్రామంలో  జరిగింది. విద్యుత్  తీగలు  తగిలి మూడు  ఏనుగులు మృతి చెందాయి.  ఈ  ప్రమాదం నండి  రెండు  ఏనుగులు మృతి చెందాయి. 

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని  చిత్తూరు, విజయనగరం,  శ్రీకాకుళం జిల్లాల్లో  ఏనుగులు తరచూ  గ్రామాల్లోకి వస్తున్నాయి.  అటవీ ప్రాంతాల నుండి   ఏనుగులు ఆహారం కోసం  గ్రామాల వైపునకు  వస్తున్నట్టుగా  అటవీశాఖాధికారులు చెబుతున్నారు.  గ్రామాలకు  దూరంగా  ఉన్న పొలాల వద్ద అడవి జంతువుల  బారిన నుండి పంట పొలాలను కాపాడేందుకు  రైతులు  కంచెలు  ఏర్పాటు  చేసి  విద్యుత్  తీగెలను  ఏర్పాటు  చేస్తున్నారు.  మరికొందరు అడవి జంతువులను  వేటాడేందుకు  కంచెలకు  విద్యుత్  షాక్  ఏర్పాటు  చేస్తున్నారని  ఫారెస్ట్ అధికారులు  చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios