Asianet News TeluguAsianet News Telugu

Royal Vashista Operation: బోటు వెలికితీతపై ధర్మాడి సత్యం స్పందన ఇదీ...

తూర్పు గోాదావరి జిల్లా దేవీపట్నం-jకచ్చులూరు మధ్యలో గత నెల 15వ తేదీన గోదావరిలో మునిగిపోయిన బోటును ధర్మాడి సత్యం బృందం మంగళవారం నాడు వెలికితీసింది.ఈ బోటును వెలికీతీయడంతో తనకు ఎంతో ఆనందంగా ఉందని సత్యం బృందం తేల్చి చెప్పింది. 

Dharmadi Satyam satisfies after Royal Vashista Lift From The Godavari River
Author
Devipatnam, First Published Oct 22, 2019, 5:00 PM IST


దేవీపట్నం: రాయల్ వశిష్ట బోటు ఆపరేషన్‌ సక్సెస్ కావడం పట్ల తనకు  చాలా సంతోషంగా ఉందని ధర్మాడి సత్యం చెప్పారు రాయల్ వశిష్ట బోటు వెలికితీతలో తన టీమ్ సక్సెస్ అయినందుకు తన ఆనందానికి అవధుల్లేవని  ఆయన చెప్పారు.

రాయల్ వశిష్ట బోటును మంగళవారం నాడు మధ్యాహ్నం గోదావరి నది నుండి వెలికితీశారు. ఈ సందర్భంగా  మంగళవారం నాడు కచ్చులూరులో గోదావరి ఒడ్డు వద్ద ఆయన  మీడియాతో  మాట్లాడారు.

Also Read:operation royal vasista: బోటును వెలికి తీసిన ధర్మాడి సత్యం టీమ్

రాయల్ వశిష్ట బోటుకు ఉన్న ఫ్యాన్‌కు  రోప్ ను  గట్టిగా బిగించడంతో బోటును సునాయాసంగా బయలకు వెలికి తీసినట్టుగా ధర్మాడి సత్యం తెలిపారు. బోటుకు కట్టిన రోప్ తెగిపోవడంతో పలు దఫాలు తాము బోటు వెలికితీయడంలో విఫలం చెందామన్నారు.

విశాఖకు చెందిన డైవర్ల సహాయాన్ని తీసుకొన్నట్టుగా ధర్మాడి సత్యం తెలిపారు. డైవర్లు గోదావరి నదిలో బోటుకు లంగర్‌ను వేశారు. ఇనుప రోప్‌ను బోటు ఫ్యాన్ కు కట్టారు. ఈ ఫ్యాన్‌కు ఇనుప రోప్ కట్టడంతో  ప్రొక్లెయినర్‌ ద్వారా బయటకు లాగినట్టుగా ఆయన చెప్పారు. 

Also Read:ఆపరేషన్ రాయల్ వశిష్టలో పురోగతి: బోటు పైభాగం వెలికితీత

తమ టీమ్ చేపట్టిన ఏ కార్యక్రమం కూడ ఫెయిల్ కాలేదని కూడ ధర్మాడి సత్యం చెప్పారు. రెండు తెలుగు రాస్ట్రాల్లో భారీ బోటు ప్రమాదంగా ఈ ప్రమాదాన్ని అధికారులు పేర్కొంటున్నారు. గోదావరిలో మునిగిన బోటును వెలికితీయడంతో చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు

సంప్రదాయ పద్దతిలో బోటును వెలికితీస్తామని చెప్పి దాన్ని సాధ్యం చేయడంతో  ధర్మాడి సత్యాన్ని టీమ్ సభ్యులు తమ భుజాలపైకి ఎత్తుకొని హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు..

గత నెల 15వ తేదీన  పాపికొండలు వెళ్తున్న రాయల్ వశిష్ట బోటు కచ్చులూరు వద్ద ముంపుకు గురైంది.ప్రమాదం జరిగిన రోజున రాయల్ వశిష్ట బోటులో 77 మంది ప్రయాణం చేసినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందారు..

ఈ ప్రమాదం నుండి 26 మంది  సురక్షితంగా  బయటకు పడ్డారు. ఇంకా 12 మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది గోదావరి నది నుండి బోటును వెలికితీసే క్రమంలో బోటులో ఐదు మృతదేహాలు బయటకు వచ్చాయి. ఇంకా ఏడు మృతదేహాలు బయటకు రావాల్సి ఉంది.

టెక్నాలజీ ఇంత పెరిగినా కూడ  సంప్రదాయ పద్దతిలోనే  రాయల్ వశిష్ట బోటును వెలికితీశారు. అండర్ వాటర్ డైవర్లు  మూడు చోట్ల  లంగర్లు వేశారు. బోటు ముందు భాగంతో పాటు వెనుక భాగానికి లంగర్లు వేశారు. ప్లాన్ ఏ  ప్రకారంగా ధర్మాడి సత్యం బృందం బోటును వెలికితీసేందుకు ప్రయత్నించింది.కానీ చివరకు ప్లాన్ బీ ని అమలు చేసి బోటును వెలికితీశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios