Asianet News TeluguAsianet News Telugu

Ruia Ambulance Issue: ఆర్ఎంఓ సస్పెండ్, సూపరింటెండ్‌కి షోకాజ్

తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చోటు చేసుకొన్న ఘటనపై సూపరింటెండ్ కు షోకాజ్ ఇచ్చింది ప్రభుత్వం. ఆర్ఎంఓను సస్పెండ్ చేసింది. మరో వైపు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది సర్కార్.

Collector Serves Show Cause Notice To RUIA Superintendent
Author
Tirupati, First Published Apr 26, 2022, 4:45 PM IST

తిరుపతి:Tirupati లోని Ruia ఆసుపత్రి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. రుయా ఆసుపత్రి సూపరింటెండ్ సూపరింటెండ్ Bharatiకి షోకాజ్ నోటీసు ఇచ్చారు. RMOను సస్పెండ్ చేశారు.  మరో వైపు అంబులెన్స్ ధరలను నిర్ణయించేందుకు అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

Annamaiah జిల్లాలోని Chitvel  కు చెందిన ఓ వ్యక్తి తన కొడుకును చికిత్స కోసం రుయా ఆసుపత్రిలో చేర్పించాడు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు చనిపోయాడు. 10 ఏళ్ల బాలుడి డెడ్ బాడీని స్వగ్రామం తీసుకెళ్లేందుకు రుయా ఆసుపత్రిలోని అంబులెన్స్ డ్రైవర్లు రూ. 20 వేలు డిమాండ్ చేశారు. అయితే బయటి నుండి అంబులెన్స్ ను తెప్పించుకొన్నా కూడా రుయా ఆసుపత్రిలోని డ్రైవర్లు అడ్డుకొన్నారు. బయటి నుండి వచ్చిన అంబులెన్స్  డ్రైవర్ పై దాడికి యత్నించారు. ఈ ఘటనపై మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో జిల్లా కలెక్టర్ స్పందించారు.  విచారణకు ఆదేశించారు. 

మంగళవారం నాడు ఉదయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, ఆర్డీఓ, డీఎస్పీలు విచారణ నిర్వహించారు.  ప్రాథమికంగా అందిన నివేదిక ఆధారంగా రుయా ఆసుపత్రి ఆర్ఎంఓను సస్పెండ్ చేశారు కలెక్టర్. సూపరింటెండ్ కి  show causeనోటీసులు జారీ చేసింది.  సోమవారం నాడు రాత్రి రుయా ఆసుపత్రిలో చోటు చేసుకొన్న ఘటనపై నలుగురు అంబులెన్స్ డ్రైవర్లపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఇప్పటికే ఆరుగురు అంబులెన్స్ డ్రైవర్లను  అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే రుయా ఆసుపత్రిలో అంబులెన్స్ లకు ధరలను నిర్ణయించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీ నిర్ణయించిన మేరకే ఫీజులను వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  ఆర్డీఓ, డీఎంహెచ్ఓ, డీఎస్పీలతో కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నిర్ణయించిన మేరకే  ధరలను వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.  తిరుపతి ఎంపీ గురుమూర్తి ఈ విషయమై జిల్లా కలెక్టర్ తో పోన్ లో మాట్లాడారు.

Follow Us:
Download App:
  • android
  • ios