Asianet News TeluguAsianet News Telugu

బ్లేడ్‌తో కోసుకొని , ఆపై హత్య:చిత్తూరు కొండమిట్ట దుర్గా ప్రశాంతి హత్యలో కీలక విషయాలు

దుర్గా ప్రశాంతిని  హత్య  చేసినట్టుగా    ప్రియుడు  చక్రవర్తి ఒప్పుకున్నాడు.  ఇవాళ  పోలీసులకు  ఈ విషయాన్ని  చక్రవర్తి  చెప్పాడు . ఆసుపత్రిలో  చికిత్స  పొందుతున్న  చక్రవర్తిని  పోలీసులు  ఇవాళ విచారించారు.

  Chittoor  Police  gathers Key  Information  in  Durga Prashanthi  Murder Case  lns
Author
First Published Apr 19, 2023, 11:37 AM IST

చిత్తూరు: జిల్లాలోని కొండమిట్టలో  దుర్గా ప్రశాంతిని  హత్య  చేసినట్టుగా  చక్రవర్తి  ఒప్పుకున్నాడు. కొండమిట్టలో  దుర్గా ప్రశాంతిని  హత్య  చేసి  తాను ఆత్మహత్యాయత్నం  చేసుకన్నాడు  చక్రవర్తి. దుర్తా ప్రశాంతి  మృతి చెందగా , చక్రవర్తి  చావుబతుకుల మధ్య  ఉండగా  పోలీసులు  ఆసుపత్రికి తరలించారు  ఆసుపత్రిలో  చికిత్స  పొందుతూ  కోలుకున్నాడు  చక్రవర్తి.  చక్రవర్తి నుండి  దుర్గాప్రశాంతి  హత్యకు గల కారణాలపై  పోలీసులు ఆరా తీశారు.  
పెళ్లికి  ఒప్పుకోకపోవడంతో  దుర్గా ప్రశాంతిని  హత్య చేసినట్టుగా  చక్రవర్తి పోలీసులకు వాంగ్మూలం  ఇచ్చారు.

ఫేస్ బుక్  లో దుర్గా ప్రవాంతి,  చక్రవర్తి  స్నేహితులయ్యారు. వీరిద్దరి  పరిచయం ప్రేమగా మారింది.  వీరిద్దరూ  పెళ్లి  చేసుకోవాలని భావించారు. తన  గురించి  చక్రవర్తి  దుర్గా ప్రశాంతికి  తప్పుడు  సమాచారం ఇచ్చాడు.   వీరిద్దరి వివాహనికి  దుర్గా ప్రశాంతి  కుటుంబ  సభ్యులు అంగీకరించలేదు.   ఇదే విషయాన్ని దుర్గా ప్రశాంతి  చక్రవర్తికి  తెలిపింది.  

also read:బ్యూటీ పార్లర్ మర్డర్ : యువతి గొంతు కోసి.. తానూ కోసుకున్న యువకుడు.. మిస్టరీగా కారణాలు...

కొండమిట్టలో దుర్గా ప్రశాంతి  బ్యూటీ పార్లర్  నిర్వహిస్తుంది.  ఈ నెల  18వ తేదీ మధ్యాహ్నం బ్యూటీ పార్లర్ కు  చక్రవర్తి  వచ్చాడు. పెళ్లి విషయమై వీరిద్దరి మధ్య  వాగ్వాదం  చోటు  చేసుకుంది.  పెళ్లి చేసుకోలేకపతే ఇద్దరం కలిసి చనిపోదామని  చక్రవర్తి  చెప్పారు.  తొలుత  చక్రవర్తి  బ్లేడ్ తో  చేయి, గొంతుపై  విచక్షణరహితంగా  గాయపర్చుకున్నాడు.  దీంతో  చక్రవర్తికి ఒంటినిండా గాయాలై  రక్తస్రావమైంది.  ఈ విషయాన్ని చూసిన  దుర్గా ప్రశాంతి  షాక్ కు గురైంది.   అదే అదనుగా  భావించిన  చక్రవర్తి  దుర్గా ప్రశాంతి  గొంతు నులిమి చంపాడు.  ఆ తర్వాత  మరోసారి తనపైతాను బ్లేడ్ తో  గాయపర్చుకున్నాడు.    ఆసుపత్రిలో  చికిత్స  పొందుతున్న  చక్రవర్తిని  పోలీసులు  బుధవారంనాడు విచారించారు.  పోలీసుల విచారణలో దుర్గా ప్రశాంతిని హత్య  చేసినట్టుగా  ఒప్పుకున్నారు.దుర్గా ప్రశాంతి  కానిస్టేబుల్ నాగరాజు  కూతురుగా పోలీసులు గుర్తించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios