Asianet News TeluguAsianet News Telugu

ఉల్లంఘిస్తే చర్యలు: ఈసీపై మరోసారి బాబు గుర్రు

 బిజినెస్ రూల్స్‌ను ఎవరు ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకొంటామని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు.ఎన్నికల కమిషన్ తన హద్దుల్ని తెలుసుకొని వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు..

chandrababu naidu sensational comments on election commission in amaravathi
Author
Amaravathi, First Published May 3, 2019, 5:20 PM IST

హైదరాబాద్:  బిజినెస్ రూల్స్‌ను ఎవరు ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకొంటామని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు.ఎన్నికల కమిషన్ తన హద్దుల్ని తెలుసుకొని వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు..తుఫాన్ తీరం దాటిన తర్వాత  ఎన్నికల  సంఘం ఎన్నికల కోడ్‌ను ఎత్తి వేసిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు.

శుక్రవారం నాడు ఆయన అమరావతిలో  ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీపై ఫణి తుఫాన్ ప్రభావం ఉండే  అవకాశం ఉన్నందున ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని  తాను ఎన్నికల  కమిషన్‌కు లేఖ రాసినట్టుగా  ఆయన గుర్తు చేశారు.

తాను నాలుగు రోజుల క్రితం లేఖ రాస్తే ఫణి తుఫాన్ తీరం దాటిన తర్వాతే  ఎన్నికల కోడ్‌ను ఎత్తివేశారని ఆయన చెప్పారు.  ఎన్నికల కమిషన్ మెచ్యూర్‌గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  అన్ని రకాల సమావేశాలు నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రధానమంత్రికి ఎవరు అనుమతులు ఇచ్చారో తెలియదన్నారు. ప్రధానమంత్రికి అనుమతులిస్తే  ఏపీలో ఎందుకు అనుమతులు ఇవ్వరని బాబు ప్రశ్నించారు.

ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాల్సిన  అవసరం ఉందన్నారు. ఎన్నికల కమిషన్ తన హద్దులను మీరకూడదని బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల డ్యూటీలో ఉన్న వాళ్లు ఎన్నికల కమిషన్‌కు రిపోర్ట్ చేయాలి,  రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్‌కు ఈసీకి ఏం సంబంధమని బాబు ప్రశ్నించారు. బిజినెస్ రూల్స్ ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్‌కు రిపోర్ట్ చేయాలన్నారు. నాలుగైదు రోజుల్లో మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి బిజినెస్ రూల్స్ ఎవరు ఉల్లంఘించినా వారిపై చర్యలు తీసుకొంటామని  ఆయన హెచ్చరించారు.


సంబంధిత వార్తలు

14 మండలాలపై ఫణి తుఫాన్ ప్రభావం: చంద్రబాబు

Follow Us:
Download App:
  • android
  • ios