Asianet News TeluguAsianet News Telugu

వివేకా హత్య కేసు.. చంద్రబాబు అసంతృప్తి

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.

chandrababu comments on kadapa SP transfer over viveka murder case
Author
Hyderabad, First Published Mar 27, 2019, 10:32 AM IST

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి కడప ఎస్పీపై వేటు పడిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు ఈరోజు స్పందించారు.

ఎన్నికలతో సంబంధంలేని ఇంటిలిజెన్స్ డీజీని బదిలీ చేసే అధికారం సీఈసీకి లేదని ఆయన అన్నారు.  అధికారుల బదిలీపై కోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించారు. అలాగే హైకోర్టులో లంచ్ మోషన్ ను మూవ్ చేయాలని టెలికాన్ఫరెన్స్ లో అధికారులకు సీఎం ఆదేశించారు.

నిఘా విభాగం బాస్‌ ఏబీ వెంకటేశ్వరరావు, మరో ఇద్దరు ఎస్పీలను ఎన్నికల కమిషన్‌ రాత్రికి రాత్రి బదిలీ చేసింది. వారికి ఎన్నికల బాధ్యతలేవీ అప్పగించవద్దని ఆదేశించింది. వైసీపీ ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి వివరణ కోరకుండా ఈసీ తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios