Asianet News TeluguAsianet News Telugu

పార్టీలో ఎలాంటి వర్గాలు లేవు: ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో పురంధేశ్వరి ప్రత్యేక పూజలు

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు  పురంధేశ్వరి  ఇవాళ  విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయాన్ని దర్శించుకున్నారు.  దుర్గమ్మ ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 

 BJP AP State  President  Purandeswari  Offers  Special Prayers  At  Vijayawada  Durga Temple lns
Author
First Published Jul 14, 2023, 9:41 AM IST

విజయవాడ: తమ పార్టీలో ఎలాంటి  వర్గాలు లేవని  బీజేపీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పురంధేశ్వరి  చెప్పారు.  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వరి  ఈ నెల  13న  బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.  శుక్రవారంనాడు ఉదయం పురంధేశ్వరి  దంపతులు  విజయవాడ ఇంద్రకీలాద్రి  దుర్గమ్మను  దర్శించుకున్నారు.  అనంతరం  పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో  పార్టీ బలోపేతం  కోసం ప్రతి కార్యకర్త సహకారం తీసుకుంటానని  ఆమె  చెప్పారు.రాష్ట్రంలో  ప్రజలంతా సుఖ సంతోషాలతో  ఉండాలని దుర్గమ్మను  కోరుకుంటున్నట్టుగా  పురంధేశ్వరి  తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పార్టీని బలోపేతం  చేసేందుకు గాను  ఆ పార్టీ జాతీయ నాయకత్వం  రంగంలోకి దిగింది.  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా  ఉన్న  సోము వీర్రాజును  తప్పించి  ఆయన స్థానంలో  మాజీ కేంద్ర మంత్రి  పురంధేశ్వరికి  బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను  ఆ పార్టీ అప్పగించింది. 

వచ్చే ఏడాది  ఏప్రిల్ లేదా మే మాసంలో  ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.  దీంతో  ఇప్పటి నుండే  బీజేపీని క్షేత్ర స్థాయి నుండి  బలోపేతం చేసేందుకు సంస్థాగత మార్పులకు  ఆ పార్టీ  శ్రీకారం చుట్టింది.  2024 పార్లమెంట్ ఎన్నికల్లో  దక్షిణాది రాష్ట్రాల నుండి ఎక్కువ ఎంపీ  సీట్లను దక్కించుకొనేందుకు  ఏ రకమైన వ్యూహంతో  ముందుకు వెళ్లాలనే దానిపై  ఇటీవలనే  హైద్రాబాద్ లో ఆ పార్టీ నాయకత్వం  వ్యూహారచన చేసింది.ఇటీవల జరిగిన  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది.  దీంతో  దక్షిణాదిపై  కమలదళం  మరింత ఫోకస్ పెట్టింది.  

2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూడ విజయం సాధించి కేంద్రంలో  మూడోసారి  అధికారంలోకి రావాలని  బీజేపీ  పట్టుదలతో  ఉంది.  ఈ దిశగా  బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహారచన చేస్తుంది.  ఈ క్రమంలోనే  పలు రాష్ట్రాల్లో సంస్థాగత మార్పులను చేపట్టింది  ఆ పార్టీ.దక్షిణాదిలోని తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై  బీజేపీ  ప్రస్తుతం కేంద్రీకరించింది. ఈ ఏడాది చివర్లో  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో  ఈ రెండు రాష్ట్రాలపై  బీజేపీ నాయకత్వం  కేంద్రీకరించింది.


 


 

Follow Us:
Download App:
  • android
  • ios