Asianet News TeluguAsianet News Telugu

పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్.. జనసేన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ !

Jana Sena YouTube Channel : ఎన్నిక‌ల టైమ్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు బిగ్ షాక్ త‌గిలింది. జ‌న‌సేన‌కు చెందిన అధికారిక యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ అయింది. హ్యాక‌ర్లు సంబంధంలేని వీడియోల‌ను ఛానెల్ లో అప్ లోడ్ చేశారు. 
 

Big shock for Pawan Kalyan during election, Janasena YouTube channel got hacked RMA
Author
First Published Apr 13, 2024, 8:53 PM IST

JanaSena YouTube channel Hacked: సార్వ‌త్రిక ఎన్నిక‌లు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు హాట్ హాట్ గా మారాయి. టీడీపీ-జ‌న‌సేన కూట‌మి, అధికార వైఎస్ఆర్సీపీ నాయ‌కుల మ‌ధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్, బీజేపీలు తామేమీ త‌క్కువ‌కాదంటూ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌తో విరుచుకుప‌డుతున్న త‌రుణంలో ప‌వన్ క‌ళ్యాణ్ కు బిగ్ షాక్ త‌గిలింది. జ‌న‌సేన‌కు చెందిన అధికారిక యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ అయింది.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌వ‌న్, జ‌న‌సేన ప్ర‌చార వీడియోల‌తో న‌డుస్తున్న ఈ కీల‌క స‌మ‌యంలో జ‌న‌సేన అధికారిక యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ గు గురికావ‌డంపై ఆ పార్టీ వ‌ర్గాలు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నాయి. ఛానెల్ హ్యాక్ కు గురికావ‌డం జ‌న‌సేన‌కు కూడా న‌ష్టం క‌లిగిస్తోంది. ఈ క్రమంలో కొందరు హ్యాకర్లు జనసేన యూట్యూబ్ ఛానల్ ను టార్గెట్ చేసి హ్యాక్ చేయడంతో పాటు ఆ పార్టీ వీడియోలను తొలగించారు. బిట్ కాయిన్ వీడియోలు అప్ లోడ్ చేశారు. దీంతో పాటు జనసేన యూట్యూబ్ ఛానల్ పేరు తొలగించి, మైక్రో స్ట్రాటజీ అని పేరును కూడా మార్చిపడేశారు.

కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో త‌మ‌కు చెందిన ఫేస్ బుక్, ట్విట్ట‌ర్, ఇన్స్టాగ్రామ్ స‌హా ఇత‌ర సోష‌ల్ మీడియా అకౌంట్లు హ్యాకింగ్ బారిన‌ప‌డ‌కుండా పార్టీలు, నాయ‌కులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఇప్ప‌టివ‌కే ప‌లువురు ఐటీ నిపుణులు, రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి హ్యాకింగ్ హెచ్చ‌రిక‌లు వ‌చ్చిన వేళ జ‌న‌సేన యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ కావ‌డంతో ఇత‌రులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. 

6, 6, 6, 4, 4, 6.. ఎవ‌డ్రా ఈ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్? వ‌స్తూనే తొలి మ్యాచ్ లో ఇలా కొట్టేశాడు.. !

ఏప్రిల్ 18న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేప‌థ్యంలో రాష్ట్రంలోని అన్ని రాజ‌కీయ పార్టీలు ప్ర‌చార హోరును మ‌రింత పెంచాయి. జ‌న‌సేన‌-టీడీపీ కూట‌మి కూడా విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నాయి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ బిజీగా ఉన్నారు. జ‌న‌సేన‌, ప‌వ‌న్ కు సంబంధించిన ఎన్నిక‌ల ప్ర‌చార వీడియోలు, క్లిప్పులను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తున్న‌ యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ కావ‌డం జ‌న‌సేన‌కు షాక్ గురిచేస్తోంది. అయితే, ఆ త‌ర్వాత కొంత స‌మ‌యం త‌ర్వాత హ్యాకైన ఛానెల్ ను తిరిగి పున‌రుద్ద‌రించారు.

 

 

 

ఐపీఎల్‌లో నిషేధానికి గురయ్యే ప్రమాదంలో రిష‌బ్ పంత్.. ! 

Follow Us:
Download App:
  • android
  • ios