Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రాలో తుపాకుల కలకలం.. ఎన్నికల వేళ హాట్ టాపిక్

ఏపీలో రెండు తుపాకులు, మూడు బుల్లెట్ల వ్యవహారం కలకలం రేపుతున్నది. విశాఖలో ఓ ట్రావెల్స్ మేనేజర్ వద్ద నుంచి పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఆయనను ప్రశ్నించగా.. అవి తనవి కావడని, ఓ ప్రయాణికుడు మరిచిపోతే తాను తీసుకున్నానని చెప్పాడు.
 

ap police seizes pistols and bullets from a travel manager in vizag kms
Author
First Published Mar 25, 2024, 6:16 AM IST

ఆంధ్రాలో ఎన్నికల వాతావరణం హీటెక్కుతున్నది. ఈ సందర్భంలో తుపాకుల కలకలం రేగింది. రెండు లేటెస్ట్ గన్నులు, మూడె బుల్లెట్లు విశాఖలో దొరికాయి. జార్ఖండ్‌కు చెందిన ఓ వ్యక్తి వీటిని వైజాగ్‌కు తీసుకురావడంతో అనుమానాలు మరింత పెరిగాయి.

వైజాగ్‌లోని శ్రీకృష్ణ ట్రావెల్స్ మేనేజర్ శివనాగరాజు నుంచి పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే.. వీటి గురించి శివనాగరాజును పోలీసులు ప్రశ్నించారు. ఈ పిస్టల్స్ ఆయన వద్దకు ఎలా వచ్చాయని అడిగారు. ఈ తుపాకులు తనకు చెందినవి కావని ఆయన చెప్పాడు. జార్ఖండ్‌కు చెందిన కునాల్ శ్రీవాత్సవ అనే వ్యక్తి విశాఖ నుంచి బెంగళూరు వెళ్లుతుండగా.. పిస్టల్స్‌ను బస్సులో మరిచిపోయాడని, అవి తాను తీసుకున్నానని వివరించాడు. అంతే తప్పితే తనకు ఆ తుపాకులతో ఏ సంబంధమూ లేదని స్పష్టం చేశాడు.

దీంతో పోలీసుల దృష్టి ఆ జార్ఖండ్ వాసిపైకి మళ్లింది. ఆయన ఎవరు? ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు వచ్చాడు? తుపాకులను ఎందుకు తెచ్చాడు? ఈ తుపాకులు లైసెన్స్‌లు ఉన్నాయా? వంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios