Asianet News TeluguAsianet News Telugu

గుడివాడలో టిడ్కో ఇళ్లను ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

గుడివాడ నియోజకవర్గంలో  రూ.799 కోట్లతో నిర్మించిన టిడ్కో ఇళ్లను  ఏపీ సీఎం వైఎస్ జగన్  ఇవాళ  ప్రారంభించారు.  
 

AP CM YS Jagan inaugurates Tidco houses in Gudivada lns
Author
First Published Jun 16, 2023, 10:50 AM IST

గుడివాడ:  రూ.799.19  కోట్లతో నిర్మించిన టిడ్కో ఇళ్లను  ఏపీ సీఎం వైఎస్ జగన్  శుక్రవారంనాడు ప్రారంభించారు.  అంతకుముందు   టిడ్కో ఇళ్లను  ఏపీ సీఎం జగన్  పరిశీలించారు.  

టిడ్కో  లేఔట్ లో వైఎస్ఆర్ విగ్రహాన్ని  సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. మల్లాయపాలెంలో  77 ఎకరాల లేఔట్ లో  8,912  టిడ్కో ఇళ్లను  నిర్మించారు. 
రూ.657  కోట్లతో  గుడివాడ నియోజకవర్గంలో 84 వైఎస్ఆర్ జగనన్న లేఔట్లలో  13,145 ఇళ్ల పట్టాలను   ప్రభుత్వం మంజూరు  చేసింది.  రూ.230 కోట్లతో  పేదలందరికీ  ఇల్లు కింద 8859  ఇల్లు మంజూరు చేసింది ప్రభుత్వం. ఇళ్ల స్థలాలు, ఇళ్లు, మౌళిక వసతులతో  గుడివాడలో  రూ.983 కోట్ల విలువైన  ఇళ్లను  పేదలకు  అందిస్తుంది.  20 ఏళ్లు స్వంత ఇల్లు లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం  ఇళ్లను  మంజూరు  చేసింది. 

 2007లో  ఇళ్ల స్థలాల  కోసం  కొడాలి నాని  గుడివాడ  నుండిహైద్రాబాద్ వరకు   పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రగా వెళ్లి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి  కొడాలి నాని  వినతి పత్రం సమర్పించిన విషయం తెలిసిందే.పేదలకు  టిడ్కో పేరుతో  ఏపీ ప్రభుత్వం  ఇళ్లను నిర్మిస్తుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios