Asianet News TeluguAsianet News Telugu

దగ్గుబాటి మారని పార్టీలు లేవు: తోడల్లుడిపై చంద్రబాబు వ్యాఖ్యలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అవ్వడంతో పాటు ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కార్యక్రమాలు జరుపుతున్నారంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఫైరయ్యారు. 

AP CM chandrababu naidu comments on daggubati venkateswerarao
Author
Vijayawada, First Published Jan 28, 2019, 9:06 AM IST

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అవ్వడంతో పాటు ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కార్యక్రమాలు జరుపుతున్నారంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఫైరయ్యారు.

దగ్గుబాటి కుటుంబం, లక్ష్మీపార్వతి వ్యవహారశైలిపై మండిపడ్డారు. అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిందని ఆయన ఆరోపించారు. రాజకీయ జీవితంలో దగ్గుబాటి మారని పార్టీలు లేవని ఆర్ఎస్ఎస్ మొదలు అన్ని పార్టీల చుట్టూ దగ్గుబాటి కుటుంబం ప్రదక్షిణలు చేసిందని బాబు ఫైరయ్యారు.

బీజేపీ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి ఇప్పుడు వైసీపీలలో చేరుతున్నారని ముఖ్యమంత్రి అన్నారు. అధికారం కోసమే లక్ష్మీపార్వతి వైసీపీతో కుమ్మక్కయ్యిందని ఎద్దేవా చేశారు.

అవకాశవాదంతోనే ఆనాడు ఎన్టీఆర్‌ను వాడుకున్నారని, తిరిగి అవకాశవాదులంతా నేడు వైసీపీ గూటికి చేరారని దుయ్యబట్టారు. బీసీల ఐక్యతను దెబ్బతీయాలనే కుట్ర జరుగుతోందని, బీసీలపై వైసీసీ, టీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకా 29 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించిందని గుర్తు చేశారు. టీఆర్ఎస‌తో జగన్ కలయిక బీసీ వ్యతిరేకమని సీఎం అభివర్ణించారు. ఆ 29 కులాల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.

ప్రజలను మభ్యపెట్టాలనేదే జగన్ అజెండా అని, అభివృద్ధిపై జగన్‌కు ఒక అజెండా అనేది లేదని ఎద్దేవా చేశారు. కుట్రలు, కుతంత్రలే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన అజెండా అని ముఖ్యమంత్రి మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios