Asianet News TeluguAsianet News Telugu

అనంతపురం అర్బన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఏర్పడింది. పూర్తిగా పట్టణ ప్రాంత పరిధిలో వుండే ఈ సెగ్మెంట్ రెడ్డి, బలిజ, మైనారిటీ, దళిత , బీసీ వర్గాలు బలంగా వున్నాయి. రెడ్డి, బలిజ, మైనారిటీ, దళిత , బీసీ వర్గాలు బలంగా వున్నాయి. ఫ్యాక్షన్‌కు కేంద్రంగా నిలిచిన ఈ గడ్డ ఎందరో ఉద్దండులను దేశానికి అందించింది. 2019లో వైసీపీ తరపున పోటీ చేసిన అనంత వెంకట్రామిరెడ్డి విజయం సాధించారు. అనంతపురం అర్బన్‌లో మరోసారి గెలిచి తీరాలని జగన్ పట్టుదలతో వున్నారు. దీనిలో భాగంగా వెంకట్రామిరెడ్డికి మరోసారి టికెట్ కేటాయించారు. అనంత టికెట్ విషయంలో టీడీపీ, జనసేన నేతల మధ్య వార్ జరుగుతోంది. 

Anantapur Urban Assembly elections result 2024 ksp
Author
First Published Mar 22, 2024, 9:55 PM IST

సీజన్‌తో సంబంధం లేకుండా అనంతపురం రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గానే సాగుతాయి. ఫ్యాక్షన్‌కు కేంద్రంగా నిలిచిన ఈ గడ్డ ఎందరో ఉద్దండులను దేశానికి అందించింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఏర్పడింది. పూర్తిగా పట్టణ ప్రాంత పరిధిలో వుండే ఈ సెగ్మెంట్లో రెడ్డి, బలిజ, మైనారిటీ, దళిత , బీసీ వర్గాలు బలంగా వున్నాయి. 2009లో కాంగ్రెస్ తరపున గురునాథ రెడ్డి విజయం సాధించారు. వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో చేరిన ఆయన 2012 ఉపఎన్నికలోనూ గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి ప్రభాకర్ చౌదరి గెలుపొందారు. 2019లో వైసీపీ తరపున పోటీ చేసిన అనంత వెంకట్రామిరెడ్డి విజయం సాధించారు. 

అనంతపురం అర్బన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. పట్టు కోల్పోకూడదని వైసీపీ :

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి అనంత వెంకట్రామిరెడ్డికి 88,704 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి ప్రభాకర్ చౌదరికి 60,006 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 10,920 ఓట్ల తేడాతో విజయం సాధించింది. అనంతపురం అర్బన్‌లో మరోసారి గెలిచి తీరాలని జగన్ పట్టుదలతో వున్నారు. దీనిలో భాగంగా వెంకట్రామిరెడ్డికి మరోసారి టికెట్ కేటాయించారు. టీడీపీ విషయానికి వస్తే.. జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఇంతవరకు అభ్యర్ధిని ఖరారు చేయలేదు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి టికెట్ తనకేనని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ ప్రాంతంలో బలిజ సామాజికవర్గం బలంగా వుండటంతో అనంతపురం అర్బన్‌ను తమకు కేటాయించాలని పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. దీనిపై ఇంకా మంతనాలు జరుగుతూ వుండటంతో అభ్యర్ధి ప్రకటనను పెండింగ్‌లో పెట్టారు. 

అనంతపురం శాసనసభ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. కూటమి అభ్యర్ధి ఎవరు :

అయితే అనంత టికెట్ విషయంలో టీడీపీ, జనసేన నేతల మధ్య వార్ జరుగుతోంది. టికెట్ ఖరారు కాకుండానే అర్బన్ టికెట్ జనసేనకేనని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తూ బ్యానర్‌లు, ఫ్లెక్సీలు కడుతున్నారు. జనసేన నుంచి వరుణ్, భవానీ రవికుమార్‌లు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వినికిడి. టీడీపీ నేతలు కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రభాకర్ చౌదరికి ఖచ్చితంగా టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios