Asianet News TeluguAsianet News Telugu

జగన్ సర్కార్ పై ఆనందయ్య విమర్శలు..

నెల్లూరు : కరోనా నివారణ కోసం తయారు చేస్తున్న మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించకపోవడం బాధాకరమని ఆనందయ్య అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మందు పంపిణీ కోసం ప్రభుత్వానికి లేఖ రాశానని, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. 

anandayya sensational comments on jagan government - bsb
Author
Hyderabad, First Published Jun 23, 2021, 3:08 PM IST

నెల్లూరు : కరోనా నివారణ కోసం తయారు చేస్తున్న మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించకపోవడం బాధాకరమని ఆనందయ్య అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మందు పంపిణీ కోసం ప్రభుత్వానికి లేఖ రాశానని, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. 

సరైన సామాగ్రి లేక మందు తయారీ విషయంలో వెనకబడ్డానని ఆనందయ్య తెలిపారు. అయినా ప్రతీ జిల్లాలో దాతల సహకారంతో ప్రజలకు మందు అందజేస్తున్నామని తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా అడిగినవారందనికీ మందు అందిస్తున్నట్లు తెలిపారు. 

అయితే బడ్డి బ్యాంకుల్లో తన మందు అమ్ముతున్నారంటే అది ప్రభుత్వ లోపమని, అటువంటి వారిమీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆనందయ్య కోరారు. కరోనా బాధితులు ఎంతమంది ఉన్నా అందరికీ ఉచితంగా మందు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆనందయ్య స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రజా ప్రతినిధుల ద్వారా మందు అందజేస్తున్నామని చెప్పారు. 

మొదటి నుంచి తనకు వెన్నుదన్నుగా నిలబడిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మందు పంపిణీ పార్టీలకు అతీతంగా చేస్తున్నామని ఏయే జిల్లాల్లో ఎన్ని పాజిటివ్ కేసులు ఉన్నాయో ప్రజా ప్రతినిధులు, అధికారులు తెలుసుకుని ఏ విధంగా చేయాలో సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆనందయ్య కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios