Asianet News TeluguAsianet News Telugu

తిరుత్తణి మురుగన్ ఆలయంలో మంత్రి రోజాకు చేదు అనుభవం..! అసలేం జరిగింటే ?  

Roja: తమిళనాడులోని తిరుత్తణి మురుగన్ ఆలయం (Thiruttani Murugan temple)లో నటి, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి రోజాతో పాటు ఆలయ నిర్వాహకుల తీరుపై వేలాది మంది భక్తులు అసహనం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే..? 

Actress Roja visits the Thiruttani Murugan temple KRJ
Author
First Published Apr 12, 2024, 11:08 AM IST

Roja:  తమిళనాడులోని తిరుత్తణి మురుగన్ ఆలయంలో (Thiruttani Murugan temple) నటి, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి రోజాతో పాటు ఆలయ నిర్వాహకుల తీరుపై వేలాది మంది భక్తులు అసహనం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే..?  నేడు కృత్తిక పర్వదినం కావడంతో మురుగ ఐదవ క్షేత్రమైన తిరుత్తణి మురుగన్ ఆలయంలో వేకువజామున మురుగ స్వామికి ప్రత్యేక అభిషేకం, దీపారాధన నిర్వహించారు. ఇందులో చెన్నై, కాంచీపురం, తిరువణ్ణామలై, వేలూరు, తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక కు చెందిన వేలాది మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని నటి, మంత్రి రోజాతో పాటు మంత్రి పీఠారెడ్డి రామచంద్రారెడ్డిలు స్వామి వారిని దర్శించుకున్నారు. 

అలాగే.. ఈ నేపథ్యంలో జరిగిన అభిషేక కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొన్నారు. అనంతరం ఆలయ పాలకవర్గం తరపున పూలమాల వేసి ప్రసాదం అందజేసి ప్రత్యేక సత్కరించారు. మంత్రి రోజాతో పాటు వారి అనుచరులు ఇరవై మందికి పైగా వచ్చారు. వారందరినీ ఆలయ నిర్వాహకులు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ సమయంలో వేలాది మంది భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.  ప్రత్యేక దర్శనం లేదనీ, ఏపీకి  చెందిన ఇద్దరు మంత్రులు, వారితో వచ్చిన 20 మందికి ఎలా  ప్రత్యేక దర్శనానికి అనుమతించారని ఆలయ నిర్వాహకులను ప్రశ్నించారు. ఈ సమయంలో ఆలయ నిర్వాహకుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios