Asianet News TeluguAsianet News Telugu

క్రైమ్ రౌండప్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్.. ఉన్నావ్ రేప్ బాధితురాలు మృతి, మరిన్ని

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన శంషాబాద్ దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపడం ఈ వారం సంచలనం సృష్టింది. దీనితో పాటు ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని కోర్టుకు వెళ్లకుండా మధ్యలోనే అడ్డుకున్న నిందితులు ఆమెకు నిప్పంటించడంతో ఆమె మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. ఇలాంటి మరిన్ని నేరవార్తలు మీకోసం

this week crime roundup
Author
Hyderabad, First Published Dec 8, 2019, 2:59 PM IST

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన శంషాబాద్ దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపడం ఈ వారం సంచలనం సృష్టింది. దీనితో పాటు ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని కోర్టుకు వెళ్లకుండా మధ్యలోనే అడ్డుకున్న నిందితులు ఆమెకు నిప్పంటించడంతో ఆమె మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. ఇలాంటి మరిన్ని నేరవార్తలు మీకోసం

దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్

దిశ హత్యాచారం నిందితులను సైబరాబాద్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా కస్టడిలోకి తీసుకున్న సిట్ బృందం వారిని సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా ఎక్క‌డైతే దిశను పెట్రోల్ పోసి నిప్పింటించారో అక్కడికి తీసుకొచ్చి విచారణ చేపట్టారు.

ఇదే సమయంలో పోలీసులకు సహకరిస్తున్నట్లుగానే నటించిన నిందితులు.. పోలీసు బలగాల చేతుల్లోంచి తుపాకులను లాక్కొని కాల్పులు జరిపడంతో పాటు రాళ్లు, కర్రలతో దాడికి దిగారు.

ఆత్మరక్షణ కోసం గత్యంతరం లేని పరిస్ధితుల్లో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు నిందితులు మహ్మద్ పాషా, నవీన్, శివ, చెన్నకేశవులు అక్కడికక్కడే మరణించినట్లు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ మీడియాకు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సజ్జనార్ మరోసారి జనం దృష్టిలో హీరోగా నిలిచారు.

అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమీషన్ సైబరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. దీనితో పాటు ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం పర్యటించే వరకు నిందితుల అంత్యక్రియలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశంపై పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారంటూ పలువురు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో.. న్యాయస్థానం కూడా విచారణకు ఆదేశించింది.

సోమవారం వరకు మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలోనే నిందితుల మృతదేహాలను భద్రపరచాలని అలాగే ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసుల వివరాలు, పంచనామా నివేదిక తదితర వివరాలను మహబూబ్‌నగర్ జిల్లా జడ్జికి అప్పగించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. 


ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మృతి

ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి చెందింది. ఢిల్లీలోని సఫ్థార్‌గంజ్ ఆస్పత్రిలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. నిన్న రాత్రి 11.10 గంటలకు ఆమెకు గుండెపోటు వచ్చిందని డాక్టర్లు చెప్పారు. లైఫ్ సపోర్ట్‌ సిస్టమ్‌పై ఉంచి చికిత్స అందించినా... ఆమె శరీరం సహకరించలేదని తెలిపారు. 

కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన 23 ఏళ్ల యువతిపై గత డిసెంబర్‌లో అత్యాచారం జరిగింది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితులను అరెస్ట్ చేశారు. నవంబర్‌ 30న ఇద్దరు నిందితులు బెయిల్‌ మీద బయటకు వచ్చారు. బాధితురాలిపై కక్ష పెంచుకున్న నిందితులు... చంపేందుకు కుట్ర చేశారు. కేసు విచారణలో భాగంగా గురువారం రాయ్‌బరేలీలోని కోర్టుకు వెళ్లిన ఆమెను దారిలోనే అడ్డుకున్నారు. అంతా చూస్తుండగానే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పటించారు. 

Also Read:వారికో న్యాయం... మాకో న్యాయమా? ఉన్నావ్ బాధితురాలి తండ్రి సూటి ప్రశ్న

బాధితురాలు కేకలు వేస్తూ కిలోమీటరు మేర పరుగులు తీసింది. అయినా ఎవరూ ఆమెకు సహాయం చేయలేదు. బాధితురాలే కాలిన గాయాలతో స్వయంగా పోలీసులకు సమాచారం ఇచ్చింది. లక్నో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత ఉన్నావ్ బాధితురాలు మేజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇచ్చింది. తనపై దాడి చేసిన వాళ్ల వివరాలను తెలిపింది. 

తనపై అత్యాచారం చేసిన ఇద్దరు సహా మొత్తం ఐదుగురు తనపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారని తెలిపింది. మరోవైపు నిందితులకు ఉరిశిక్షపడాలన్నది తన చివరి కోరికంటూ నిన్న ఉదయం తన తల్లిదండ్రులకు ఆమె చెప్పడం గమనార్హం. అది నెరవేరకుండానే కన్నుమూయడం బాధాకరం.


సనత్‌నగర్‌లో టెక్కి అనుమానాస్పద మృతి


హైదరాబాద్‌ సనత్ నగర్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పూర్ణిమ అనుమానాస్పద స్థితిలో మృతి  చెందింది. పూర్ణిమ మృతిపై భర్త కార్తీక్ పై పూర్ణిమ కుటుంబసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.  పూర్ణిమను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్టుగా బాధిత కుటుంబసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పూర్ణిమ 20 రోజుల క్రితం తన ప్రియుడు కార్తీక్ ‌ను ప్రేమించి పెళ్లి చేసుకొంది. వీరిద్దరూ సనత్‌నగర్ లో కాపురం పెట్టారు. అయితే పెళ్లైన 20 రోజులకే  పూర్ణిమ అనుమానాస్పదంగా మృతి చెందడంపై  పూర్ణిమ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. పూర్ణిమను కార్తీక్ హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు.

Also Read:సనత్‌నగర్‌లో టెక్కీ అనుమానాస్పద మృతి

సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ ముందు బాధిత కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు.పూర్ణిమ ఆత్మహత్య చేసుకొనేంత పిరికిది కాదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. పూర్ణిమ మరణానికి కారకులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

హైద్రాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త కూతురే పూర్ణిమ.హైద్రాబాద్‌లో పూర్ణిమ తండ్రికి ఓ ఫ్యాక్టరీ ఉంది. పూర్ణిమకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.ఈ సమయంలోనే తమ ఫ్యాక్టరీలో పనిచేసే కార్తీక్ ను విహవాం చేసుకొన్నట్టుగా పూర్ణిమ తల్లిదండ్రులకు పోటోలను చూపింది.

ఈ విషయమై తల్లిదండ్రులతో పూర్ణిమ గొడవకు దిగింది. ఈ విషయమై పోలీస్ కేసుల వరకు కూడ వెళ్లింది. ఈ విషయమై పూర్ణిమకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అయితే తన ప్రియుడితోనే తాను ఉంటానని పూర్ణిమ పోలీసుల కౌన్సిలింగ్ లో చెప్పింది. దీంతో పూర్ణిమ సనత్ నగర్ లో కార్తీక్ తో కలిసి ఉంటుంది. 

ప్రియుడితో కలిసి భర్తను సజీవదహనం చేసిన భార్య

హైదరాబాద్ వనస్థలిపురం ఎస్‌కెడి నగర్ లో రమేష్ అనే వ్యక్తి సజీవ దహనం కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని  భావించి  భర్త రమేష్ ను చంపింది భార్య స్వప్న. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైద్రాబాద్ వనస్థలిపురంలోని ఎస్‌కెడి నగర్ లో ఈ ఏడాది నవంబర్ 26వ తేదీన రమేష్ తన గుడిసెలో సజీవ దహనమయ్యాడు. కొంత కాలం క్రితం రమేష్, స్వప్నను పెళ్లి చేసుకొన్నాడు. రమేష్, స్వప్నల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. స్వప్నకు వెంకటయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయాన్ని గుర్తించిన రమేష్ భార్యను హెచ్చరించారు. 

Also Read:హైద్రాబాద్‌లో దారుణం: ప్రియుడితో కలిసి భర్తను సజీవ దహనం చేసిన భార్య

అయినా ఆమెలో మార్పు రాలేదు. పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టాడు. అయితే  తాను తన ప్రియుడు వెంకటయ్యతో సంబంధాలను తెగదెంపులు చేసుకొంటానని స్వప్న తేల్చి చెప్పింది.అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు.  తన ప్రియుడితో వివాహేతర సంబంధానికి భర్త రమేష్ అడ్డుగా ఉన్నాడని స్వప్న భావించింది.  తన భర్త అడ్డును తొలగించుకోవాలని భావించింది.

ఈ నెల 26వ తేదీన తన గుడిసెలో నిద్రపోతున్న రమేష్ను స్వప్న ప్రియుడితో కలిసి హత్య చేసింది. రమేష్ నిద్రిస్తున్న సమయంలో  గుడిసెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే రమేష్ షార్ట్ సర్క్యూట్  తో మంటల్లో సజీవ దహనమయ్యాడని భార్య స్వప్న స్థానికులను నమ్మించింది.

Follow Us:
Download App:
  • android
  • ios