Woman

శోభితా ఫ్యాషన్ సెన్స్ సూపర్.. అమ్మాయిలంతా ఫాలో అవ్వాల్సిందే..!

గోల్డెన్ బోర్డర్ సిల్క్ చీర

ఫ్యూషియా పింక్ రంగు ఇప్పుడు బాగా ట్రెండ్‌లో ఉంది. ఈ తరహా సిల్క్ చీరల్లో ఎవరైనా చాలా అందంగా కనిపిస్తారు. ఇలాంటి చీరతో మీరు ఎల్లప్పుడూ డిజైనర్ బ్లౌజ్ జత చేయాలి.

ఎత్నిక్ బనారసి అనార్కలి

ఫ్యాషనిస్టా శోభితా ఈ ఎత్నిక్ బనారసి అనార్కలిలో చాలా అందంగా కనిపిస్తున్నారు. గులాబీ , ఊదా రంగులో ఉన్న ఈ అనార్కలి ట్రెడిషనల్ వేర్ కి పర్ఫెక్ట్ ఛాయిస్.

స్టోన్ వర్క్ ఐవరీ చీర

స్టోన్ వర్క్ ఉన్న తెల్ల చీరలో శోభితా చాలా క్లాసీగా కనపడుతున్నాు. ఈ శారీకి సూటయ్యేలా ఆమె  ఆక్సిడైజ్డ్ నగలు ధరించగా, లుక్ మాత్రం గ్రేస్ ఫుల్ గా ఉంది. 

ఆర్గాంజా ఫ్లోరల్ సూట్

ఈ ఆర్గాంజా ఫ్లోరల్ ప్రింట్ సల్వార్ సూట్‌లో శోభితా అద్భుతంగా కనిపిస్తున్నారు.  ఆమె డీప్ నెక్, ఫుల్ స్లీవ్స్, లాంగ్ లెంగ్త్‌ని ఎంచుకుంది. సింపుల్ ఎత్నిక్ వేర్ గా ఇది ఒక ఛాయిస్.

లైమ్ టిష్యూ చీర

టిష్యూ చీరల జనాదరణ మళ్ళీ పెరుగుతోంది. లైట్షే డ్స్ ఇందులో చాలా బాగుంటాయి. శోభితా ధరించిన ఈ లైమ్ టిష్యూ చీర కాంట్రాస్ట్ బ్లౌజ్‌తో అద్భుతంగా ఉంది.

పాటియాలా సూట్

 వెల్వెట్ పాటియాలా సూట్‌లో శోభితా అద్భుతంగా కనిపిస్తున్నారు. దీనితో పాటు పొడవైన జుమ్కాలు.. మరింత అందాన్ని పెంచాయి. 

గోల్డెన్ సీక్విన్ బెంజ్ చీర

శోభితా ధూళిపాలా సెమీ గోల్డెన్ సీక్విన్ చీర ధరించారు. పార్టీ , ఫంక్షన్స్ లో తాము సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలవడానికి ఇలాంటివి ప్రయత్నించవచ్చు.

ప్లెయిన్ సాటిన్ చీర డిజైన్

క్రేప్ నుండి సాటిన్ వరకు, ఈ రోజుల్లో ఈ తరహా సింగిల్ షేడ్ ప్లెయిన్ చీర డిజైన్లు చాలా ప్రాచుర్యం పొందాయి. శోభితా తన చీర రూపాన్ని మెరుగుపరచడానికి హల్టర్ నెక్ బ్లౌజ్‌ను ఎంచుకుంది.

జుట్టు పెరగడానికి కలబందను ఎలా ఉపయోగించాలి?