Woman
ఖర్జూరాలు తీయగా ఉంటాయి. కానీ వీటిలో ఆడవారి ఇమ్యూనిటీ పవర్ ను పెంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే ఒంట్లో రక్తం పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకలు బలంగా ఉంటాయి.
చలికాలంలో ఆడవాళ్లు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాల్లో చేపలు కూడా ఉన్నాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉన్న చేపల్ని తింటే ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి.
ఈ సీజన్ లో ఉసిరికాయలు పుష్కలంగా దొరుకుతాయి. వీటిని తింటే మీ ఇమ్యూనిటీ పవర్ పెరిగే విటమిన్ సి అందుతుంది. అలాగే మీ జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. దగ్గు, జలుబు తొందరగా తగ్గుతాయి.
చలికాలంలో ఆడవాళ్లు ఖచ్చితంగా తినాల్సిన వాటిలో బాదం, వాల్ నట్స్ వంటి గింజలు, విత్తనాలు కూడా ఉన్నాయి. వీటిని తింటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
చలికాలంలో ఆడవాళ్లు నువ్వులను తింటే చాలా మంచిది. దీనిలో ఉండే పోషకాలు ఆడవాళ్ల ఎముకల్ని బలంగా ఉంచుతాయి. అలాగే హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతాయి. పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తాయి.
చలికాలంలో ఆడవాళ్లు చిలగడదుంపను తినడం వల్ల బోొలెడు లాభాలు కలుగుతాయి. ఈ చిలగడదుంపలను తింటే ఆడవాళ్లు చలికాలంలో ఆరోగ్యంగా ఉంటారు.
ఆడవాళ్లకు నల్ల కిస్ మిస్ లు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి.అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పిత్త సమస్యలను,ఐరన్ లోపాన్ని పోగొడుతాయి.