Woman
ముఖంలో చిన్న రంధ్రాలు ఉంటాయి. డెడ్ స్కిన్ సెల్స్, దుమ్ము ఆ రంధ్రాల్లో చేరితే ఇవి ఏర్పడతాయి. ముక్కు చుట్టూ సేబాషియస్ గ్రంథులు ఎక్కువగా ఉండటం వలన కూడా ఇవి రావచ్చు.
కొన్ని హోం రెమిడీస్ ఉపయోగించి మీరు వైట్ హెడ్స్ ని పూర్తిగా తొలగించవచ్చు.
కావలసినవి
1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
బేకింగ్ సోడా, తేనె,నిమ్మరసం కలిపి మీ ముక్కు చుట్టూ రుద్దండి. తర్వాత సున్నితంగా మసాజ్ చేసి 10 నుండి 15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే సరిపోతుంది.
బేకింగ్ సోడా ఒక ఎక్స్‌ఫోలియెంట్‌గా పనిచేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించడానికి సహాయపడుతుంది.
తేనె సహజ యాంటీ బాక్టీరియల్ ,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది.మొటిమలను తగ్గిస్తుంది.
నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మంపై అదనపు నూనెను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. వైట్ హెడ్స్ తగ్గిస్తుంది.