Woman

బంకమట్టి ఫేస్ ప్యాక్ తో అలియా భట్ లా అందంగా కనిపిస్తారు

స్కిన్ కేర్ టిప్స్

ఆలియా భట్ ముఖం ఎంత అందంగా మెరిసిపోతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె ముఖంపై ఒక్క మచ్చ కూడా కనిపించదు. దీనికోసం ఆమె ఎలాంటి చిట్కాలను ఫాలో అవుతుందో తెలుసా? 

ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్స్

ఆలియా భట్ ముఖం అందంగా కనిపించడానికి ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ ను వాడుతుంది. మీరు ఈ రాఖీ పండుగకు అందంగా కనిపించాలనుకుంటే మీరు కూడా ఈ ప్యాక్ లను ట్రై చేయండి. 

తేనె, ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్

ఈ ప్యాక్ ను రెడీ చేయడానికి ముల్తానీ మట్టిని తీసుకుని అందులో తేనె, టమాటా రసం, నిమ్మరసం, కొన్ని పాలు పోసి పేస్ట్ లా చేయండి. దీన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగేయండి. 

ముల్తానీ మట్టి, చందనం ప్యాక్

ఈ ఫేస్ ప్యాక్ తయారుచేయడానికి ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టిలో అర టేబుల్ స్పూన్ చందనం పొడి, 1/4 టేబుల్ స్పూన్ పసుపు పొడి, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ లేదా లేదా పాలు పోయండి

కూల్ వాటర్

బంకమన్ను ఎర్రచందనం ఫేస్ ప్యాక్‌ను ముఖానికి పట్టించి పూర్తిగా ఆరనివ్వండి. తర్వాత కూల్ వాటర్ తోనే ముఖాన్ని కడగండి. అప్పుడే మీ ముఖంలో గ్లో వస్తుంది. 

ఆరెంజ్ తొక్క, ముల్తానీ మట్టి

ముల్తానీ మట్టి తీసుకుని దానిలో  ఒక టేబుట్ స్పూన్ తేనె, నిమ్మరసం, అర టేబుల్ స్పూన్ నారింజ తొక్క పొడి, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసి ప్యాక్ తయారుచేయండి. దీన్ని ముఖానికి అప్లై చేయండి.

రోజ్ వాటర్, ముల్తానీ మట్టి ప్యాక్

ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఈ బంకమన్ను చాలా మంచిది. ఈ ప్యాక్ తయారు చేయడానికి 2 టేబుల్ స్పూన్ల ముల్తానీ లో  2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ ను కలిపి ముఖానికి అప్లై చేయండి. 

Find Next One