Relations

ఇలా చేస్తే భార్యభర్తలిద్దరూ సంతోషంగా ఉంటారు: సుధామూర్తి

భర్తకు తోడుగా నిలిచిన సుధా మూర్తి

పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. సుధా మూర్తి కూడా అదే చేశారు. 

బహుముఖ ప్రజ్ఞాశాలి సుధా మూర్తి

ఇన్ఫోసిస్ ను ప్రారంభించడంలో ఎన్‌.ఆర్. నారాయణ మూర్తికి సహాయం చేసిన సుధా మూర్తి ఒక ఉపాధ్యాయురాలు, రచయిత్రి. సామాజిక కార్యకర్తగానూ సేవలందిస్తున్నారు. 

సుధా మూర్తి వివాహ చిట్కాలు

వివాహ బంధాన్ని జీవితాంతం ఎలా కొనసాగించాలనే దానిపై ఒక ఇంటర్వ్యూలో యువ జంటలకు సుధా మూర్తి కొన్ని చిట్కాలను అందించారు. ఆ చిట్కాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

వివాహంలో గొడవలు సహజం

మీరు వివాహితులైతే మీరు గొడవ పడతారు. దాన్ని అంగీకరించండి. భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండటం అసంభవం.

ఎవరూ పరిపూర్ణులు కారు

జీవితం అంటే వదులుకోవడం, తీసుకోవడం. పరిపూర్ణమైన జీవితం అని ఏదీ లేదు. పరిపూర్ణమైన జంట అంటూ ఎవరూ ఉండరు. ప్రతి బంధంలోనూ కష్టనష్టాలుంటాయి.   

చింతించకండి

మీలో ఒకరు కోపంగా ఉన్నప్పుడు మరొకరు సైలెంట్ గా ఉండాలి. కొంత సేపటికి వారే అర్థం చేసుకొని కామ్ అవుతారు. వాదన వల్ల సమస్య పరిష్కారం కాదు.

ఒకరికొకరు సహాయం చేసుకోండి

స్త్రీలు బయటకు వెళ్లి పని చేస్తున్నప్పుడు పురుషులు తమ భార్యలే అన్ని పనులూ చేయాలని ఆశించకూడదు. పనులను షేర్ చేసుకొని ఒకరికొకరు సహాయం చేసుకోవాలి.

భార్య భారాన్ని తగ్గించండి

పురుషులు కూడా వంటగదిలో తమ భార్యకు సహాయం చేయాలి. కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి పురుషులు తమ భార్యల భారాన్ని పంచుకోవాలి.

భార్యాభర్తలు ఈ 5 విషయాల్లో అస్సలు సిగ్గుపడకూడదు

ప్రేమలో మోసపోకండి, లవ్ బాంబింగ్ అంటే ఏమిటీ?