“నేను అన్నీ మార్చుకుంటా” వంటి మాటలు నిజాయితీ లేకుండా చెబితే, అవి మీపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయి.
గిఫ్ట్ లు ఇవ్వడం సమస్యకు పరిష్కారం కాదు. వారి ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవడం ద్వారా సమస్యకు చెక్ పెట్టాలి.
క్షమాపణ కేవలం ఒక మాట కాదు.. ఒక భావోద్వేగం. అర్థం చేసుకోకుండా.. “క్షమించండి” అని పదే పదే చెప్పడం వల్ల మీ మాటకు విలువ తగ్గుతుంది.
వ్యక్తిగత గొడవల్లో ఇతరులను చేర్చడం మంచిది కాదు. దీనివల్ల సమస్య మరింత పెద్దదవుతుంది.
క్షమాపణ లేదా సర్దిచెప్పడం కోసం కేవలం టెక్స్ట్ పై ఆధారపడకండి. భావోద్వేగాల గురించి మాట్లాడేటప్పుడు ముఖాముఖిగా లేదా కనీసం కాల్ లో మాట్లాడటం మంచిది.
ప్రతి ఒక్కరికీ కోపం తగ్గడానికి, పరిస్థితిని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి తొందరపడి వారిని కూల్ చేయడానికి ప్రయత్నించకండి.
విషయాన్ని అర్థం చేసుకోకుండా.. మీరు ప్రతిసారీ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే అది మీ మధ్య దూరాన్ని మరింత పెంచవచ్చు.
“వదిలేయ్, ఏమీ కాలేదు” వంటి సమాధానాలు ఇవ్వడం వల్ల కోపంగా ఉన్న పార్ట్ నర్ మరింత బాధపడతారు. మీరు వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదని భావిస్తారు.
వారు ఏదైనా చెబుతుంటే.. వారి మాట వినండి. సమాధానం చెప్పడానికి కాదు, అర్థం చేసుకోవడానికి వినండి. వాదించడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది.