Relations

ఆఫీసుకు వెళ్లే ముందు ఇలా చేస్తే మీ లైఫ్ పార్ట్‌నర్ హ్యాపీ

రాత్రిళ్లే ఉదయం పనులు ప్లాన్ చేయండి

రాత్రి పడుకొనే ముందే ఉదయం చేయాల్సిన పనులు ప్లాన్ చేసుకోండి. టిఫిన్ ఏం చేయాలి, డ్రెస్ ఏం వేసుకోవాలి ఇలాంటివి. దీనివల్ల మీ భాగస్వామితో ఎక్కువ సేపు గడపడానికి వీలుంటుంది. 

పది నిమిషాలు హగ్ చేసుకొని ఉండండి

బెడ్ పైనుంచి లేవడానికి ముందు పది నిమిషాలు మీ పార్ట్‌నర్ ను హత్తుకుని ఉండండి. వారిని ముద్దు పెట్టుకోండి. శరీరానికి మసాజ్ చేయండి. మంచి నవ్వుతో రోజు ప్రారంభమవుతుంది.

లవ్ యు చెప్పి రోజును ప్రారంభించండి

దంపతులు ఇద్దరూ కలిసి నిద్ర లేవాలి. ఒకరినొకరు ప్రేమిస్తున్నానని చెప్పుకోవాలి. ఇది మీ బంధాన్ని బలపరుస్తుంది.

కలిసి ఎక్సర్సైజ్ చేయండి

మీరిద్దరూ కలిసి ఎక్సర్సైజ్ లేదా స్ట్రెచ్చింగ్ చేయండి. ఇది మీ శక్తిని పెంచుతుంది. మాట్లాడుకోవడానికి, సరదాగా గడపడానికి సమయం దొరుకుతుంది.

టీ, కాఫీ కలిసి ఆస్వాదించండి

ఉదయం టీ లేదా కాఫీ సమయం మీ రోజును మరింత ప్రత్యేకంగా చేస్తుంది. ఈ కొన్ని క్షణాలు మీకు ప్రశాంతంగా కలిసి కూర్చోవడానికి అవకాశం కల్పిస్తాయి.

పరస్పరం ప్రశంసించుకోండి

నిజమైన ప్రశంసలు మీ భాగస్వామి రోజును ఆనందంగా మారుస్తాయి. మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి. మీరు మీ భాగస్వామిని ఎందుకు ప్రేమిస్తున్నారో గుర్తు చేస్తుంది.

ఆఫీస్ కి వెళ్లే ముందు హత్తుకుని వెళ్ళండి

ఆఫీస్ కి వెళ్లే ముందు మీ భాగస్వామికి ముద్దు పెట్టి, హత్తుకుని వెళ్ళండి. మీరు తిరిగి వచ్చినప్పుడు కూడా ఇలా చేయండి. మీ రిలేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. 

భార్యభర్తలు సంతోషంగా ఉండటానికి సీక్రెట్స్ ఇవే

ఆదర్శవంతమైన భార్య అంటే ఎలా ఉండాలో తెలుసా?

ఆన్‌లైన్‌లో పెళ్లాం కావాలా?

ఇలా చేస్తే భార్యభర్తలిద్దరూ సంతోషంగా ఉంటారు: సుధామూర్తి