సిగ్గు పడకుండా భార్యభర్తలు మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇవి
అసంతృప్తి
ఏదైనా విషయంలో మీ పార్ట్ నర్ తో అసంతృప్తి ఉంటే ఆ విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పాలి. ఈ విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు.
ప్రేమను వ్యక్తపరచడం
చాలా మంది భార్యాభర్తలు ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి సందేహిస్తారు. కానీ పబ్లిక్ ప్లేస్ లలో కూడా మీరు ఒకరినొకరు ప్రశంసించుకోవచ్చు.
ఆర్థిక పరిస్థితి
ఇంటి ఖర్చుల గురించి లేదా జీతం గురించి భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడటానికి సిగ్గుపడతారు. కానీ మీరు పెట్టుబడి, ఖర్చుల గురించి మాట్లాడితే మీ ఇంటిని బాగా నిర్వహించుకోవచ్చు.
శారీరక అవసరాలు
వివాహ జీవితంలో శారీరక సంబంధం చాలా ముఖ్యమైన భాగం. భార్యాభర్తలు తమ శారీరక అవసరాలు, కోరికల గురించి ఒకరితో ఒకరు ఓపెన్ గా మాట్లాడుకోవాలి. అలాగే ఈ విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు.
బలహీనతల గురించి
ప్రతి ఒక్కరికీ కొన్ని బలహీనతలు, అభద్రతా భావాలు ఉంటాయి. బలహీనతల గురించి ఒకరితో ఒకరు చెప్పుకోరు. కానీ దీన్ని చెప్పుకోవడానికి భార్యాభర్తలు సిగ్గుపడాల్సిన అవసరం లేదు.