pregnancy & parenting
పిల్లల బుద్ధి పెరగడానికి గుడ్డు తినిపించండి. గుడ్డులో విటమిన్ బి12, ప్రోటీన్, సెలీనియం ఉంటాయి. గుడ్డు తింటే మెదడు శక్తి పెరుగుతుంది.
బాదంను సూపర్ ఫుడ్ అంటారు. బాదంలో విటమిన్-ఇతో సహా చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి పనికొస్తాయి.
అక్రోట్లను డ్రై ఫ్రూట్స్‌లో బ్రెయిన్ ఫుడ్ అంటారు. అక్రోట్లను తినడం వల్ల పిల్లలు త్వరగా నేర్చుకునే శక్తిని పెంచుకుంటారు.
వీటిలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు బాగా ఉంటాయి. బెర్రీస్ తినడం వల్ల మెదడు కణాలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. దీంతో శరీరం కూడా బాగుంటుంది.
పిల్లల మెదడు శక్తిని పెంచడానికి పాలకూర, మెంతి, బ్రోకలీ, కాకరకాయ తినిపించండి. ఈ కూరగాయలు తెలివిని పెంచుతాయి.
పిల్లలకు రోజూ ఓట్స్ లేదా ఓట్ మీల్ తినిపించవచ్చు. ఫైబర్ నిండిన ఓట్స్ బ్రేక్‌ఫాస్ట్‌కు పర్ఫెక్ట్ ఫుడ్.