NATIONAL

కోహినూర్ డైమండ్ : అసలు యజమానులు ఎవరో తెలుసా?

కోహినూర్ వజ్రం ఎక్కడ ఉంది?

కోహినూర్ వజ్రం అనగానే చాలా మందికి బాధ కలుగుతుంది. ఎందుకంటే ఈ విలువైన వజ్రం ఒకప్పుడు భారతదేశానికి చెందినది, కానీ ఇప్పుడు ఇంగ్లాండ్‌లో ఉంది.

కోహినూర్ ఎందరి చేతులు మారిందో...

కోహినూర్ కి ఒక సుదీర్ఘమైన, ఆసక్తికరమైన కథ ఉంది. దీని ప్రయాణం భారతదేశం నుండి ఇంగ్లాండ్ వెళ్లి రాణి కిరీటంలో చేరడంతో ముగియలేదు.  

కొహినూరు వజ్రాన్ని అసలెవ్వరూ కొనిందే లేదు

కోహినూర్ వజ్రాన్ని ఎప్పుడూ ఎవరూ కొనలేదు లేదా అమ్మలేదు అని మీకు తెలుసా? ఇది ఎల్లప్పుడూ బహుమతిగా ఇవ్వబడింది లేదా యుద్ధంలో గెలుచుకున్నారు.

కోహినూర్ వజ్రం అసలు యజమాని ఎవరు?

కోహినూర్ గురించి చరిత్రలో, వార్తల్లో చాలా వినుంటారు, చదివుంటారు. కానీ ఈ వజ్రం అసలు యజమాని ఎవరో మీకు తెలుసా?

కాకతీయులదే కోహినూర్ వజ్రం

కోహినూర్ వజ్రం కాకతీయ రాజులది. వారు దీన్ని భద్రకాళీ దేవికి అలంకరించేవారు

కోహినూర్ వజ్రం ఎక్కడ దొరికింది?

కోహినూర్ వజ్రం దాదాపు 800 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని కొల్లూరు గనిలో దొరికింది.

కోహినూర్ వజ్రం ఎన్ని క్యారెట్లు?

కోహినూర్ వజ్రం బరువు 186 క్యారెట్లు, అప్పటి అతిపెద్ద వజ్రమిదే.

అల్లావుద్దీన్ ఖిల్జీ చెంతకు కోహినూర్

14వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ కాకతీయ రాజులపై దాడి చేసి ఈ వజ్రాన్ని చేజిక్కించుకున్నాడు.

బ్రిటిష్ కిరీటంలో భాగమైన కోహినూర్

ఆ తర్వాత అనేకమంది చేతులుమారి చివరకు బ్రిటిష్ వారి దగ్గరకు చేరింది. వాళ్లు తమ మహారాణి కిరీటంలో దాన్ని పొదిగారు. నేటికీ కోహినూర్ వజ్రం ప్రపంచవ్యాప్తంగా ఐశ్వర్యానికి ప్రతీక.

ఏ రాష్ట్ర సీఎం చదువులో టాప్? చంద్రబాబు, యోగి విద్యార్హతలేంటి?

మన్మోహన్ సింగ్ ది కోహ్లీ కుటుంబమా? ఆయనగురించి ఎవరికీ తెలియని 7 విషయాలు

చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన మన్మోహన్ సింగ్... అదేంటో తెలుసా?

వీడి జీతం రూ.13,000... కానీ ప్రియురాలికి వజ్రాల కళ్లద్దాలు గిప్ట్