పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరని ప్రకటించారు. దీంతో ఆమె కూతురు ఇల్తిజా ముఫ్తీ సీఎం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఎవరీ ఇల్తిజా ముఫ్తీ?
మెహబూబా ముఫ్తీ కుమార్తె ఈ ఇల్తిజా ముఫ్తీ. తక్కువ సమయంలోనే జమ్మూ-కశ్మీర్ రాజకీయాల్లోకి మంచి నాయకురాలుగా పేరు తెచ్చుకున్నారు.
ఇల్తిజా తండ్రి
ఇల్తిజా తల్లి మెహబూబా ముప్తీ జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎంగా అందరికీ సుపరిచితమే. కానీ ఆమె తండ్రి జావేద్ ఇక్బాల్ గురించి తెలుసా? ఆయన ప్రముఖ రచయిత మాత్రమే కాదు రాజకీయ విశ్లేషకులు
తల్లి విడుదల కోసం పోరాటం
2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత మెహబూబా ముఫ్తీని గృహనిర్భందం చేశారు. తన తల్లి విడుదల కోసం ఇల్తిజా పోరాటం చేశారు.
మెహబూబాకు ప్రచారం
మెహబూబా ముఫ్తీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో అనంతనాగ్-రాజోరి నుంచి పోటీ చేశారు. ఇల్తిజా ఆమె కోసం ప్రచారం చేశారు.
మాస్టర్స్ డిగ్రీ చేశారు
ఇల్తిజా తన ప్రాథమిక విద్యను కశ్మీర్‌లో పూర్తి చేసుకున్నారు. తర్వాత ఢిల్లీ వెళ్లి చదువుకున్నారు. ఆ తర్వాత యూకేలో మాస్టర్స్ డిగ్రీ చేసారు.
అంతరిక్షంలోకి వెళ్లాలని కోరిక
ఇల్తిజా లండన్‌లోని భారతీయ హైకమిషన్, ఆస్ట్రేలియా ఇండియా ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేశారు. ఆమె మొదట వ్యోమగామి కావాలని కోరుకునేవారు.
బిజ్‌బెహోరా నుంచి పోటీ
ఇల్తిజా జమ్మూ-కశ్మీర్‌లోని పీడీపీ బిజ్‌బెహోరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.