భారతదేశంలో ఆవుల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం. ఇక్కడ పశువుల సంఖ్య 300 మిలియన్లకు పైగా ఉంది. పాల ఉత్పత్తిలో మన దేశం నంబర్ వన్.
పాల ఉత్పత్తిలోనూ భారత్ టాప్
ప్రపంచం మొత్తం పాల ఉత్పత్తిలో 24% భారత్ లోనే. ఆ తర్వాత అత్యధిక పాల ఉత్పత్తిలో రెండవ స్థానం అమెరికాది. ఆ తర్వాత చైనా, పాకిస్తాన్, బ్రెజిల్‌లు వస్తాయి.
ఏ దేశంలో ఎంత పాల ఉత్పత్తి?
2022 గణాంకాల ప్రకారం భారతదేశం 213,779,230 టన్నుల ఆవు పాలు, అమెరికా 102,747,320 టన్నులు, పాకిస్తాన్ 62,557,950 టన్నులు, చైనా 39,914,930 టన్నుల ఆవు పాలు ఉత్పత్తి చేస్తున్నాయి.
ప్రపంచంలోని మొత్తం ఆవుల పాల దిగుబడి ఎంత?
ఓ నివేదికల ప్రకారం, ప్రపంచంలో 264 మిలియన్లకు పైగా పాలిచ్చే ఆవులు ఉన్నాయి. ఇవి సంవత్సరానికి 600 మిలియన్ టన్నుల పాలు ఇస్తాయి. ప్రతి ఆవు పాల ఉత్పత్తి ప్రపంచ సగటు సుమారు 2,200 లీటర్లు.
అత్యధిక పాలు ఇచ్చే ఆవు ఏది?
అమెరికాలో ఒకటిని మించి మరొకటి పాలిచ్చే ఆవులు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా పాలు ఇచ్చే హోల్‌స్టీన్ జాతి ఆవు కూడా అమెరికాదే. ఇది ఒకేసారి 90 నుండి 100 లీటర్ల వరకు పాలు ఇస్తుంది.
హోల్‌స్టీన్ ఆవు ఎంత పాలు ఇస్తుంది?
ప్రపంచంలోని పాలిచ్చే ఆవులలో సుమారు 800 జాతులలో నెంబర్ 1 హోల్‌స్టీన్ ఆవులు, ఇవి సంవత్సరానికి 33000 లీటర్ల పాలు ఇస్తాయి. అమెరికా పాల ఉత్పత్తిలో ఈ ఆవు వాటానే 90% వరకు ఉంది.
భారతదేశంలో అత్యధిక పాలు ఇచ్చే ఆవులివే...
భారతదేశంలో ఆవులలో 37 జాతులు ఉన్నాయి. వీటిలో సాహివాల్, గిర్, లాల్ సింధీ, థార్‌పార్కర్, రాథి అత్యధికంగా పాలు ఇస్తాయి. పాకిస్తాన్‌లో సాహివాల్, చోలిస్తానీ జాతులు కనిపిస్తాయి.