Lifestyle
ప్రపంచ సింహ దినోత్సవం 2024 సందర్భంగా, సింహాల గురించి మీకు తెలియని 7 ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి
సింహాల గర్జన 5 మైళ్ల దూరం వరకు వినిపిస్తుంది. ఈ శక్తివంతమైన శబ్ధం అవి ఏ ప్రాంతంలో ఉన్నాయో తెలపడమే కాకుండా, ఇతర సింహాలతో కమ్యునికేట్ కావడానికి ఉపయోగపడుతుంది.
సింహాలు సామాజిక జంతువులు. అవి గుంపులుగా నివసిస్తాయి. ఈ గుంపుల్లో 30 వరకు సింహాలు ఉంటాయి.
సింహాల గుంపుల్లో ఆడ సింహాలే ఎక్కువగా వేటాడతాయి. ఆడ సింహాలు నైపుణ్యవంతమైన వేటగాళ్లు. తరచుగా ఆహారం కోసం కలిసి పనిచేస్తాయి.
సింహం జూలు దాని రాజసాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది ఆధిపత్య చిహ్నంగానూ కనబడుతుంది. ఇతర జంతువులతో పోరాడే సమయంలో సింహం మెడను రక్షించుకోవడానికి ఈ జూలు సహాయపడుతుంది.
సింహాలు ఎక్కువగా నిద్రపోవడానికి పేరు పొందాయి. అవి రోజుకు 20 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటాయి. అంతలా నిద్ర పోవడం వల్లే బలంగా వేటాడగలుగుతాయి.
ఒకప్పుడు యూరప్, ఆసియా, ఆఫ్రికా అంతటా తిరిగిన సింహాల ఆవాసాలు ఇప్పుడు ఎక్కువగా ఉప-సహారా ఆఫ్రికాకు పరిమితం అయ్యాయి.
సింహాలు పసుపు నుండి గోధుమ రంగు వరకు వివిధ రకాల కళ్ల రంగులను కలిగి ఉంటాయి. రంగు కొన్నిసార్లు వయస్సు, ఆరోగ్యాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది.