మహాభారత యుద్ధాన్ని ఆపేందుకు విదురుడు ధృతరాష్ట్రుడికి ఎన్నో విషయాలు చెప్పాడు. వాటినే విదుర నీతి అంటారు. మన జీవితానికి ఉపయోగపడే ఎన్నో సూత్రాలు అందులో ఉన్నాయి.
నిద్ర పట్టనివ్వని 4 విషయాలు
విదురు నీతి ప్రకారం, ఏ వ్యక్తికైనా నిద్ర లేకుండా చేసే 4 విషయాల గురించి తెలుసుకోండి.
కామవాంఛ..
కామవాంఛలు గలవారికి నిద్ర పట్టదు. వాటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఈ కోరికలే వారిని చెడు మార్గంలో నడిపిస్తాయి.
బలవంతుడైన శత్రువు..
బలవంతుడైన శత్రువు ఉంటే, ఎప్పుడు దాడి చేస్తాడో అనే భయంతో నిద్ర పట్టదు.
అన్నీ పోగొట్టుకుంటే
అన్నీ పోగొట్టుకున్నవారికి పోయిన వాటి గురించే ఆలోచనలు. ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో నిద్ర పట్టదు.
దొంగతనం అలవాటైతే
దొంగతనం అలవాటైనవారికి దొంగతనం చేయాలనే ఆలోచనలతో నిద్ర పట్టదు.